- ఇప్పటికే రెడ్డిల పార్టీ అంటూ ముద్ర..
- ఇదే ప్రధాన అస్త్రంగా బీజేపీ ముందుకు..
- అన్ని వర్గాలను ఆదుకోకుంటే జగన్ కు పట్టిన గతే పడుతుందా.?

తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో అద్భుత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. పార్టీ ఇంతటి విజయం సాధించడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి అని చెప్పవచ్చు. ఆయన టిపిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం నెలకొన్నది. ఈ ఉత్సాహంతోనే పాత కాంగ్రెస్ శ్రేణులంతా ఏకమై పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. మరిన్ని పథకాలను కూడా అమలు చేసే దిశలో దూసుకెళ్తోంది. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్నది.కానీ ఆ ఒక్క పనిలో మాత్రం మిస్టేక్ చేస్తుందని తెలుస్తోంది. మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పేంటో ఇప్పుడు చూద్దాం.

 సీఎం రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తుందని అనుకున్నారు. కానీ ఈయన సీఎం అయిన తర్వాత కూడా రెడ్డిలకే ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. అత్యధికంగా ఉండేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సరైన స్థానం లభించడం లేదని తెలుస్తోంది. దీన్నే ప్రధాన అస్త్రంగా తీసుకున్నటువంటి బిజెపి కాంగ్రెస్ పాలన అంటే రెడ్డి పాలనే అంటూ హేళన చేస్తూ వస్తోంది.  రెడ్డి పాలన విడనాడితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారం చేతిలోకి వస్తుందని అంటున్నారు.  ఈ విధంగా రేవంత్ రెడ్డి రెడ్డిలకు పెద్దపీట వేయకుండా అన్ని వర్గాలకు సమపాళ్లలో ఛాన్స్ ఇచ్చి ముందుకు వెళ్తే మాత్రం  ఈ ఒక్కసారి కాదు వచ్చే 2028 ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కు తిరుగుండదని అంటున్నారు. అంతేకాకుండా ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా మిస్టేక్ చేయకుండా అమలు చేయాలి. ఎక్కువగా యువతకు రాజకీయంగా భవిష్యత్తు ఇవ్వాలి. కాంగ్రెస్ లో ఉండేటువంటి  వర్గపోరు, సీనియర్ లీడర్లకు పెద్దపీట వేయడం వంటివి మానుకోవాలి. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులను తీసుకురావాలి. ఈ విధంగా సీఎం రేవంత్,  రెడ్డి ఫీలింగ్ ను వదిలేసి  ప్రజాభివృద్ధే ప్రధమ ధ్యేయంగా ముందుకు వెళ్తే కాంగ్రెస్ కు పది సంవత్సరాల దాకా డోకా ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి రేవంత్ రెడ్డి తన పాలనలో స్ట్రాటజీ చూపిస్తారా..లేదంటే అదే రెడ్డి ఫీలింగ్ తో ముందుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డిలా ఛతికిల పడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: