తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ సర్కార్ రూలింగ్ విషయంలో టీజీ ఓటర్లు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. రుణమాఫీ దిశగా రేవంత్ అడుగులు వేయడం రైతులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. 2 లక్షల రుణమాఫీ హామీని అమలు చేయడం సాధారణమైన విషయం కాదనే సంగతి తెలిసిందే.
 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక విధంగా రుణమాఫీ హామీనే కారణమని చాలామంది భావిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సైతం ప్రశంసలు పొందుతున్నాయి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లటం కూడా రేవంత్ రెడ్డి సక్సెస్ సీక్రెట్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడానికి రేవంత్ రెడ్ది తన వంతు కష్టపడుతున్నారు.
 
కాంగ్రెస్ పాలన బీ.ఆర్.ఎస్ కంటే మెరుగ్గానే ఉందని గతంతో పోల్చి చూస్తే మరింత బెటర్ గా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ వాసులు కామెంట్లు చేస్తున్నారు. రైతే రాజు అయ్యే దిశగా తెలంగాణ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు సైతం ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
 
రేవంత్ రెడ్డి పాలన ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే విధంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రుణమాఫీ, రైతు బంధు లాంటి పథకాలు భవిష్యత్తులో ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బెస్ట్ సీఎంలలో రేవంత్ రెడ్డి ఒకరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాల అమలు దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: