ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారా..? ఆయనలో ఇంత నిర్వేదం ఎందుకు..? వచ్చింది. అసలు జగన్ నోటి వెంట ఈ మాట ఎందుకు..? వచ్చింది అన్నది చూద్దాం. తాజాగా ఘోర‌ ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సొంత పార్టీ నేతలతో సమావేశాలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో గత వారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పై వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.


ఫలితాలు చూశాక షాక్ అయ్యా.. ఇదేంటి ఇంత మంచి పనులు చేస్తే ఈ రిజల్ట్ ఇచ్చారు ఏంటి.. అసలు రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదాం అనిపించింది అని జగన్ అన్న వ్యాఖ్యలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. ఫలితాలు చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో జగన్ ఈ మాటలు అన్నట్టు తెలిసింది. నిజంగానే హిమాలయాలకు వెళ్లిపోదామని అనిపించింది.. ఆ షాక్ లో నుంచి బయటకు రావడానికి రెండు మూడు రోజులకు పైనే పట్టింది.. కనీసం సీట్లు కూడా మనకు ప్రజలు ఇవ్వలేదు.. ఎన్నికల్లో సీటు రాకపోయినా 40% ఓట్ల మన పార్టీకి వచ్చాయి అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారని జ‌గ‌న్ అన్నట్టు భోగ‌ట్టా..?


ఈ 40 % ఓట్లు చూశాకనే మనం నిలబడాలి. దాంతోనే మెల్లగా ఫలితాల శాఖ నుంచి బయటికి వచ్చాను. ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయి అని చెప్పేందుకు చాలా అనుమానాలు, కారణాలు ఉన్నా మనకు వచ్చిన 40 శాతం ఓట్లు వల్ల చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము... ఇప్పుడు నా పరిస్థితే ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుంది. మీ పరిస్థితి కూడా నేను అర్థం చేసుకుంటాను... నేను బయటకు వచ్చినట్టే మీరు కూడా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు వచ్చి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కావాలని జగన్ పార్టీ నేతలకు సూచించినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: