•దారుణమైన పరిస్థితిలో ఉన్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌!
•కేసీఆర్‌ ని కుదేలు చేసిన ఎంపీ ఎన్నికల ఘోరమైన ఓటమి!
•పీఎం అవ్వాలనుకున్న కేసీఆర్ కి సీఎం సీటు కూడా కరువైంది!

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ): కేసీఆర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమకాలీన తెలుగు రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేత. తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ కొనసాగించి ఏకంగా 14 ఏళ్లపాటు అలుపెరుగని పోరాటం చేసి.. అసాధ్యం అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం చేసి చూపించిన రాజకీయ నేత. అయితే ఎలాంటి గొప్ప నేతకైనా గడ్డు కాలం అనేది తప్పదు. ప్రస్తుతం కేసీఆర్‌ టైమ్ కూడా అలాగే నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్‌ పదేళ్ల పాటు తెలంగాణలో అంతులేని ఆధిపత్యం సాధించి తెలంగాణకి నియంతలా అయ్యాడు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాక.. మొదట్లో అద్భుతంగా పాలన సాగించి ఏకంగా ఆంధ్రావాళ్లు కూడా మెచ్చుకునేలా అభివృద్ధి చేసి చూపించాడు. తన ప్రత్యర్థులు కనీసం ఊహించని లేని పథకాలని పెట్టి జనం మెప్పు పొందాడు.

కానీ.. రానురాను మితిమీరిన అహంభావం, జనంతో తగ్గిపోయిన సంబంధాలు, అడుగడుగునా కుటుంబ పెత్తనం, రాజరికపు పోకడలు..తెలంగాణకి తానే రాజు అనుకోవడం ఇవన్నీ కూడా కేసీఆర్‌ రాజకీయ జీవితాన్ని పతనం చేశాయి.  గత ఎన్నికల్లో చాలా దారుణాతి దారుణంగా ఓటమి పాలైన కేసీఆర్‌.. ఆ తర్వాత ఇంకా ఎన్నో ఇబ్బందుల్లో పడ్డారు. విచిత్రం ఏంటంటే 10 ఏళ్ళు తెలంగాణకి సీఎం అయిన కెసిఆర్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క స్థానం కూడా గెలవకపోవడం ఆ పార్టీకి నిజంగా సిగ్గు చేటనే చెప్పాలి. దీనికి తోడు ఆయన ఎమ్మెల్యేలు కూడా వరుస పెట్టి మరీ BRS ని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోతున్నారు. కెసిఆర్ తెలంగాణ సీఎంగా ఎంత పైకి వెళ్ళాడో అంత దారుణంగా కింద పడ్డాడు. trs అనే ప్రాంతీయ పార్టీని BRS అనే జాతీయ పార్టీగా మార్చి సీఎం నుంచి పీఎం కావాలనుకున్న కెసిఆర్ కి ఇప్పుడు కనీసం తెలంగాణ సీఎం సీటు తెచ్చుకోవడం కూడా అందని డ్రాక్ష లాగా అయ్యింది. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో దూసుకుపోతున్న క్రమంలో BRS పుంజుకోవడం చాలా కష్టమే అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. మరి చూడాలి భవిష్యత్తులో BRS పరిస్థితి ఎలా ఉంటుందనేది...?

మరింత సమాచారం తెలుసుకోండి: