* తెలంగాణలో బలహీన పడుతున్న బీఆర్ఎస్  

* కేటీఆర్ హరీష్ రావు మారకపోతే ఈసారీ ఓటమి ఖాయమే  

* హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ కూడా ఓడిపోయే అవకాశం  

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ  ఇంకా తేడాది అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది ఇక పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు. సంక్లిష్టమైన పరిస్థితిని ఈ పార్టీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తన ఫామ్ హౌజులో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో చాలా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని విడిచిపెట్టి వెళ్ళవద్దని కోరుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని ఆ గెలుపుతో జీవితం ఉజ్వలంగా ఉంటుందని అంటున్నారు. కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకోవడానికి కేసీఆర్ పడుతున్న తిప్పలు అన్ని నీకు అయితే ఆయన ఇలా కష్టపడుతుంటే  కేటీఆర్, హరీష్ రావు మాత్రం తమకే అన్నీ తెలుసు అని అహంకారంగా మాట్లాడుతున్నారు. జస్ట్ రెండు పర్సంట్‌ ఓటింగ్ తేడా ఉంది అని, ఐదేళ్లు గిర్రున తిరిగి వచ్చేస్తాయని మళ్లీ తానే అధికారంలోకి వస్తున్నామని మాట్లాడుతున్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని బాగా తొక్కి పడేస్తోంది. కట్ చేస్తే  బీఆర్ఎస్ పార్టీ బలం అనేది పూర్తిగా కనుమరుగయింది. తెలంగాణలో బిజెపి లేని లేరు కానీ ఇప్పుడు అది కేసీఆర్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణ సెంటిమెంట్ పదేళ్ల వరకు పనికి వచ్చింది కానీ ఇకపై పనికి వచ్చే అవకాశం లేదు. పాలన వైఫల్యాలు అందరికీ ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి ఆ పార్టీ వేయాలంటే ఈ వైఫల్యాలను చూసి జనాలు వెనక్కి తగ్గుతున్నారు.

 రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు ఇలా ఒక్క కులానికి మాత్రమే ఆర్థిక సహాయం అందజేస్తున్నారు ఆ ఒక్క కులంలో సంపన్నులు చాలామంది ఉంటున్నారు అయినా వాళ్లకి డబ్బులు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆ బంధువులకు అర్హత లేని వాళ్ళు చాలా కోపం వ్యక్తం చేస్తున్నారు ఇల్లు లేని వాళ్లు కూడా తమకు ఇల్లు ఇవ్వలేదని కేసీఆర్ అంటేనే మండి పడుతున్నారు. పగ పట్టినట్టు బీఆర్ఎస్ పార్టీని ప్రతి ఎన్నికల్లో ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు ప్రజలు. ఈ సమయంలో కేటీఆర్ హరీష్ రావు "అన్నీ మాకే తెలుసు మేము చెప్పినట్లే పాలన సాగుతుంది, మేం చేసిందే కరెక్టు, దేవుడు కూడా అందరినీ సంతోష పరచలేడు" అనుకుంటూ వెళ్తే చివరికి అసలు వచ్చేది వీళ్ళకే. ఈ నేతలు ఇప్పటికైనా మారాలి.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది ఫ్రీ బస్ కారణంగా భోజనాల కంటే ఎక్కువగా నష్టాలే ఉంటున్నాయి. బస్సులో ఎక్కడికైనా వెళ్లాలంటే వాటిని ఎక్కడమూ, దిగడమూ కష్టమే అవుతుంది. కాంగ్రెస్‌కు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తే ఓడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. లేదంటే ప్రజల మనసు మార్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs