పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికీ పదేళ్లు పూర్తి అయిన ఒక్క సీటు కూడా గెలవలేదు .కానీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ బిజెపి, జనసేన, టిడిపి పార్టీలను ఏకం చేసి 2024 ఎన్నికలలో పోటీ చేయగా భారీ విజయాన్ని అందుకున్నారు. జనసేన గా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎన్నో బహిరంగ సభలలో చాలా విమర్శలు చేశారు. ముఖ్యంగా అప్పుడు వైసిపి పార్టీ మీద ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలుగా మారాయి. కొన్నిసార్లు వివాదాస్పదంగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి.


ముఖ్యంగా ఆంధ్రాలో 30 వేలకు పైగా మహిళలు, యువతలు మిస్సింగ్ అయ్యారని ఈ విషయం మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరంతా కనపడడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఏపీలో ఇదో అతిపెద్ద మిస్సింగ్ కేసు అన్నట్లుగా తెలిపారు. ఉమెన్ ట్రాఫికింగ్ అని కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా కేంద్రం నుంచి తనకు నిఘా సంస్థలు తెలియజేశారని చాలా విశ్వసనీయ సమాచారం వచ్చిందని కూడా పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి.


ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయని అందువల్లే పవన్ కళ్యాణ్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు అని నమ్మబలికారు. అయితే అప్పట్లో ఈ విషయం పైన వైసిపి ప్రభుత్వం అలాంటిదేమీ లేదు అంటూ కూడా తెలిపింది. అయితే ఉపముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళల మిస్సింగ్ కేసుని బయటికి తీయాలంటూ చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు సైతం చేస్తూ ఉన్నారు ప్రజలు.. ముఖ్యంగా కేఏ పాల్ వంటి వారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాకుండా ఆ మహిళల యువతల కుటుంబాలలో వెలుగు నింపాలని కూడా కోరారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన చర్చలు జరిపి చొరవ తీసుకొని చూపిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు విలువ ఉంటుందని లేకపోతే అవి వట్టి మాటలే అన్నట్టుగా మిగిలిపోతాయని ప్రజలతోపాటు పలువురు నేతలు జనసేన కార్యకర్తలు కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: