ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత... పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని... గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసిపి అధికారం కోల్పోయిందని... చాలామంది కీలక నేతలు జంప్ అవుతున్నారు. కేసుల భయంతో మరికొంతమంది వెళ్లిపోతున్నారు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... 175 స్థానాలు గెలుచుకుంటామని వైసిపి ముందుకు వెళ్ళింది. కానీ ఫలితాలు వచ్చేసరికి... సీన్ రివర్స్ అయింది.

175 కాదు కదా... ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కేవలం 11 స్థానాలకి... వైసిపి పరిమితమైంది. ఈ నేపథ్యంలో... వైసీపీలో ఉన్న లీడర్లే కాకుండా...  ఆ పార్టీలో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కమెడియన్ ఆలీ... వైసిపి పార్టీని వీడుతూ...  తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తనకు అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేదని... సినిమాల చేసుకుంటానని చెబుతూ.. చాలా తెలివిగా వైసీపీని వీడారు ఆలీ.

గతంలో... వైసీపీ ఎంపీ టికెట్ ఆశించిన ఆలీ... మొన్నటి వరకు కీలక పదవిలో కూడా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి కష్టం వచ్చినప్పుడు... వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఏపీలో.. కూటమి అధికారంలోకి రావడంతో... తన సినిమా కెరీర్ కు దెబ్బతింటుందని ఆలీ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. కొంతమంది అంటున్నారు. అయితే ఆలీతో పాటు మరికొంతమంది...టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు బయటకు వెళ్తారని తెలుస్తోంది.

అందులో పోసాని కృష్ణ మురళి, మాజీ మంత్రి రోజా కూడా  ఉన్నారని అంటున్నారు. రోజా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈసారి ఓడిపోయారు.  వైసిపి కూడా అధికారం కోల్పోవడంతో ఆమె బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపిలో ఉంటే రాజకీయంగా అలాగే సినిమాల పరంగా... ఎలాంటి డోకా ఉండదని ఆమె భావిస్తున్నారట. అటు పోసాని కృష్ణ మురళి కూడా.. వైసీపీని వీడి తన భవిష్యత్తును...  కాపాడుకోవాలని అనుకుంటున్నారట. ఇలాగే వైసిపిలో ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: