ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ ఏపీలో లేడన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అవును, ప్రస్తుతం జగన్ ఇపుడు బెంగళూరులో తాను ఎంతో మోజు పడి కట్టించుకున్న 27 ఎకరాల సువిశాలమైన 'యెహలంక' పాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ పాలెస్ కట్టించుకున్న తరువాత జగన్ అందులో పట్టుమని 10 రోజులు కూడా లేడు. అయితే ఇపుడు ఆయనకు ఆ చాన్స్ చిక్కింది. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైస్సార్సీపీ నాయకులు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో జగన్ కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వదిలి బెంగుళూరులో సెటిల్ అయ్యాడు.

మొన్నామధ్య జగన్ పులివెందుల నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే జగన్ లంకంత కొంపలో ఏం చేస్తున్నాడనే అనుమానాలు బయట వ్యక్తం అవుతున్నాయి. ఇందులో కీలకమైన పాయింట్ ఏంటి అంటే జగన్ యెహలంక పాలెస్ నుంచి జగన్ తిరిగి ఏపీకి రారు అని, ఆయన అక్కడే సెటిలైపోయాడనే గుసగుసలు చాలా గట్టిగా వినబడుతున్నాయి. జగన్ ఏపీకి మాత్రమే కాదు, హైదరాబాద్ కి కూడా ఎట్టిపరిస్థితుల్లో రారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు కాబట్టి, ఆయన జగన్ పక్కా వ్యతిరేకి అని ఓ వర్గంవారు అనుమానిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల హైదరాబాద్ లో లోటస్ పాండ్ భవనం ముందు నిర్మాణాలను కూలగొట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ ఇన్సిడెంట్ తరువాత జగన్ కి హైదరాబాద్ లో కూడా తనపై కుతంత్రాలు జరుగుతున్నాయని ఫీల్ అయినట్టు భావించారట. ఈ విషయంపై జగన్ కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే యెలహంక పాలెస్ లో జగన్ ఏమి చేస్తున్నారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. యెలహంక పాలెస్ నుంచి హెలికాప్టర్ ద్వారా వెళ్ళి చాలా సీక్రెట్ గా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని జగన్ కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. తన సొంత చెల్లెలు షర్మిలతో సెటిల్మెంట్ చేయమని జగన్ డీకేని కోరారని కూడా వార్తా కధనాలను ప్రస్తుతం కొన్ని ఛానళ్లలో వెల్లువెత్తుతున్నాయి. ఆస్తులు అన్నీ తాను పంచేశాను అని జగన్ డీకేకు చెప్పినట్లుగా చెబుతున్నారు. విషయం ఏమైనా జగన్ మీద వ్యతిరేక మీడియాలో వస్తున్న వార్తలు వైసీపీ క్యాడర్ ని అయితే పూర్తి అయోమయంలో నెట్టేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: