ఈసారి ఏపీ ఎన్నికల్లో అద్భుతం జరిగింది. ఆంధ్రా జనాలు ఏకపక్షంగా టీడీపీ కూటమికే పట్టం కట్టారు. గత ప్రభుత్వ అరాచక పాలనలో నలిగి పోయిన ఓటర్లు ఈసారి ముక్తకంఠంతో ఒకేతాటిపై పయనించారు. ఫలితంగా టీడీపీ కూటమి ఎన్నడూ రానంత భారీ మెజారిటీ సక్సెస్ ని పొందింది. ఇక ఎన్నికల ముందు వరకు వై నాట్ 175 అని విర్రవీగిన వైస్సార్సీపీ ప్రభుత్వం చతికల పడింది. ఇక టీడీపీ పార్టీ అభ్యర్థులు మునుపెన్నడూ లేని విధంగా భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే టీడీపీ కొన్ని మైలురాళ్లను అధిగమించింది.

అవును, మీరు విన్నది నిజమే. అక్కడ దాదాపు 2 శాబ్దాల తరువాత టీడీపీ జెండా ఎగర వేయగలిగింది. విషయంలోకి వెళితే, గుంటూరు జిల్లా, నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ అరవింద బాబు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈయన ఇక్కడి నుండి రెండోసారి పోటీ చేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేతిలో ఓటమి చెందడం జరిగింది. అయినా టీడీపీ అధినాయకత్వం ఆయనికి విడిచి పెట్టలేదు. అప్పట్లో ఎన్నికల అనంతరం ఆయనికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది.

ఈ క్రమంలో చదలవాడ ఇంఛార్జిగా పార్టీ, ప్రజా వ్యతిరేక పోరాట కార్యక్రమాలను విస్తృ తంగా చేపడుతూ జనాల్లోకి దూసుకెళ్లారు. కాగా తాజా ఎన్నికల్లో (2024) కూడా వైసీపీ నుంచి reddy GOPIREDDY' target='_blank' title='గోపిరెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టీడీపీ నుంచి చదలవాడ అరవింద బాబు పోటీ చేయగా ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. అయితే ఈసారి ఆంధ్రాలో గాలి ఏకపక్షం వైపు వీచింది. టీడీపీ కూటమి అభ్యర్థులను భారీగా గెలిపించారు. ఈ నేపథ్యంలోనే బి సి కులానికి చెందిన చదలవాడ అరవింద బాబు భారీ మెజారితో గుంటూరు జిల్లా, నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. గెలిచిన తరువాత కూడా అరవింద బాబు రెస్ట్ తీసుకోకుండా జనాల్లోకి దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో జనాలకు కావలసిన అవసరాలను, సమస్యలను గురించి అధినాయకత్వంతో చర్చిస్తూ సేవ చేస్తున్నారు. ఇదే దూకుడుతో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా అరవింద బాబు మరోమారు కూడా అక్కడ గెలవబోతారు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: