ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పింఛనీదారులకు ఒక బహిరంగ లేఖని రాయడం జరిగింది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రధమ కర్తవ్యం అంటూ తను రాసిన లేఖలో చంద్రబాబు తెలియజేశారు. అందరి మద్దతు వల్ల ప్రజలకు సంక్షేమం చూపించే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయింది.ఏ ఆశలు ఆంశాలతో అయితే మీరు ఓటు వేశారో వాటిని నెరవేర్చే క్షణం రానే వచ్చేసింది.. మేని పోస్టులో చెప్పినట్టుగానే ఫించన్ నేను ఒకేసారి పెంచాను.. ఇకపై 4000 రూపాయలు ఇస్తున్నాను దివ్యాంగులకు 3000 పెంచి 6000 ఇస్తున్నాను అంటూ తెలిపారు.


28 వర్గాలకు చెందిన 65,18,496 మంది లబ్ధి పొందుతున్న  పింఛనీ లబ్ధిదారులకు పెంచిన పింఛన్తో తో సహా  జులై 1వ తేదీన పింఛన్ ఇంటి వద్దకే ఉద్యోగుల సైతం అందిస్తారు అంటూ తెలియజేశారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఏర్పడింది కనుక తొలి రోజు నుంచె మంచి చేసే నిర్ణయాలను సైతం తీసుకుంటున్నామని తెలిపారు. పెంచిన పెంచిన వల్ల ప్రతినెల ప్రభుత్వానికి సైతం రూ.819 కోట్లకు పైగా భారం పడుతుందని వెల్లడించారు.


ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం అధికారపక్షం మిమ్మల్ని పించిని విషయంలో చాలా ఇబ్బందులు పెట్టారు. మూడు నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలను చూసి తాను చలించిపోయానని అందుకే ఏప్రిల్ నెల నుంచి పింఛన్ పెంపును వర్తింప చేశానంటూ తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలలో ఈ పెంపు అందరికీ వర్తిస్తుంది అంటూ తెలిపారు చంద్రబాబు.ఎన్టీఆర్ భరోసా పేరుతో మీ ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ జరుగుతుంది అంటూ తెలియజేశారు. ఎప్పుడు మంచి చేయాలని చూసి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు లేక ద్వారా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: