అవును, మీరు విన్నది నిజమే. కేవలం ఓ పది రూపాయిల గురించి ఓ యువకుడు మరో వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. రాష్ట్రంలో నానాటికీ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, పాతబస్తీలో లా అనేది నడుస్తుందా? అనే అనుమానం సర్వత్రా వ్యక్తమౌతోంది. అవును, 10 రూపాయలు ఆటో ఛార్జ్ అడిగిన పాపానికి ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. రూ. 10 చెల్లించే విషయంలో ప్రయాణికుడికి, ఆటో డ్రైవర్‌ తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆ ప్రయాణికుడు ఆటో డ్రైవరుని తీవ్రంగా కొట్టాడు. దీంతో చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ గురువారం ఆసుపత్రిలో మరణించాడు.

దాంతో ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ ప్రయాణికుడు పరార్ అవ్వడంతో ఆ దుర్మార్గుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయంలోకి వెళితే వట్టెపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అన్వర్ (39) జూన్ 12న చార్మినార్ వద్ద ఓ ప్రయాణికుడుని ఆటో ఎక్కించుకొని షంషీర్‌గంజ్‌లో దింపాడు. షంషీర్‌గంజ్ చేరుకున్న తర్వాత, ప్రయాణీకుడు రూ.10 చెల్లించాడు, అయితే అన్వర్ ఛార్జ్ రూ.20 అని, దాంతో మరో రూ.10 చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగి ఘర్షణకు దారితీసింది.

ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడు డ్రైవర్ అన్వర్‌ను అన్నారని మాటలతో దూషించడమే కాకుండా తీవ్రంగా ఆయన ముఖ్యంపైన పుడుగుద్దులతో రెచ్చిపోయాడట. ఇది గమనించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రయాణికుడు అక్కడి నుంచి భయంతో పరార్ అయ్యాడు. అయితే అప్పటికీ జరగకూడని నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు అన్వర్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. దాంతో చికిత్స పొందుతూ అన్వర్ జూన్ 27న మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ ఆ దుండగుడు ప్రస్తుతం పరార్ లో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: