తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ అత్యంత గడ్డు పరిస్థితిలను ఎదుర్కొంటోంది. గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని... ఒంటి చేత్తో కెసిఆర్ ఏలారు.  అయితే మొన్న 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... గులాబీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ ఓటమి బాధను మర్చిపోకముందే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా... గులాబీ పార్టీ జీరో కు పరిమితం అయిపోయింది.  దీంతో గులాబీ పార్టీ నేతలు అందరూ... పక్క చూపు చూస్తున్నారు.

39 ఎమ్మెల్యేలను గెలుచుకున్న గులాబీ... ఇప్పుడు 32 కు పడిపోయింది. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇప్పటివరకు... దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి,  కాల యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు ఇలా వరుసగా అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అయితే పార్టీ నేతలు.. కాంగ్రెస్ లోకి వెళ్తున్న... నేపథ్యంలో ఫామ్ హౌస్ లో కేసీఆర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారు.

 ఆత్మీయ సమావేశాల పేరుతో... అన్ని జిల్లాల నేతలు అలాగే అభిమానులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా... పార్టీ నుంచి వెళ్లే వారిని వెళ్లనివ్వండి అని.. అంతకంటే గొప్ప నాయకులను మనం తయారు చేసుకుందామని నాయకులకు అలాగే కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు కేసీఆర్.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను గులాబీ పార్టీ తయారు చేసిందని... అలాంటి నాయకులను ఇంకా తయారు చేసుకుందామని... కెసిఆర్ స్పష్టం చేశారు.

 అయితే ఇలా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా... రోజుకు ఒక లీడర్ బయటకు వెళ్తున్నారు. కెసిఆర్ తో సమావేశం అయినప్పటికీ కూడా... కాలే యాదయ్య నిన్న జంప్ అయ్యారు. ఇక త్వరలోనే మరో అయిదుగురు ఎమ్మెల్యేలు... జంప్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకు మంచి భరోసా ఇచ్చిన కూడా... కెసిఆర్ మాట ఒక్కరు వినడం లేదు. తమ భవిష్యత్తు కోసం... బయటికి వెళ్తున్నామని ఈ చెపుతున్నారు. దీంతో గులాబీ పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: