రేవంత్ రెడ్డి, చంద్రబాబు గురించి జనాలకు ఓ అభిప్రాయం ఉంది. అదేమిటంటే బాబుకి రేవంత్ అత్యంత సన్నిహితుడని, రాజకీయ శిష్యుడని. వారి మధ్య బంధం దేవుడికెరుక గానీ, వీరెప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. పైగా ఇద్దరూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల స్థానాలను అధిరోహించారు కాబట్టి దాదాపు మీడియాలన్నీ వీరిద్దరివైపే ఫోకస్ పెట్టాయి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీడీపీ కోరి పైకి లేపుతోంది అని మాట్లాడుకుంటున్నారు ఓ వర్గంవారు. ఇకపోతే ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఇటువంటి రాజకీయ చర్చకు దారి తీశాయి అని చెప్పుకోవచ్చు.

తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే వారికి 10 శాతం మేర ఓటు షేర్ వచ్చి ఉండేదని రేవంత్ రెడ్డి అనడం ఇపుడు తెలంగాణా వాదులకు ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే టీడీపీ అన్నది తెలంగాణాలో ముగిసిన అధ్యాయం అన్నది తెలంగాణావాదుల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో మేము ఏనాడన్నా తప్పు చేశామా? అని టీడీపీని వారు ప్రశ్నిస్తున్నారు. విషయం ఏమిటంటే 2014 నుంచి టీడీపీ గ్రాఫ్ పడిపోతూ 2018 నాటికి దాదాపుగా తగ్గిపోయింది. ఈ నేపధ్యంలో అప్పటి నుంచి గత అయిదేళ్లుగా పొలిటికల్ గా పెద్దగా యాక్టివిటీ కూడా లేని నేపధ్యంలో ఎలా పది శాతం ఓటు షేర్ వస్తుందని ప్రశ్నిస్తున్నారు?

ఇక ఎక్కడ నుంచి అంత పర్శంటేజ్ వస్తుందని కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఈ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడని, నాయకుడు అనేవాడు ఏది పడితే అది మాట్లాడ కూడదని, చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందని అన్నారు. ఇకపోతే కాంగ్రెస్ కి టీడీపీ బద్ధ శత్రువు. అది కూడా జాతీయ స్థాయిలో మరో బద్ధ శత్రువు అయిన బీజేపీతో కలసి ఎన్డీయేలో టీడీపీ ఉంది. ఈ క్రమంలో అన్నీ తెలిసేనా రేవంత్ రెడ్డి టీడీపీ గ్రాఫ్ పెంచే పని చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ గురించి మర్చిపోయారని ఆ పార్టీ నేతలు గుబులు చెందుతున్నారని వినికిడి. నిజానికి టీడీపీ కాంగ్రెస్ కి ఎదురు నిలిచి ఉంది. 2019 తరువాత అనేక కార్యక్రమాలు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నిర్వహిస్తే కూడా టీడీపీ ముఖం చాటేసింది అని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్యన రేవంత్ అలా ప్రవర్తించి ఉండకూడదని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: