ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగు దేశం పార్టీ భారీ మొత్తంలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక చంద్రబాబు నాయుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు. ఆ తర్వాత 2019వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి భారీ మొత్తంలో మెజారిటీ రావడంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రెండు దఫాలలోను చాలా మందిని మంత్రులుగా నియమించారు. కానీ వారికి అంత పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు.

 వారు ఏమి చేయాలి అనుకున్న కూడా పై నుండి ఆదేశాలు వస్తేనే చేసే విధంగా ఉండేది. వాటి వల్ల మంత్రి పదవులు ఉన్నా కూడా వారు ఏమి చేయాలని పరిస్థితి నెలకొనేది. దాని వల్ల ప్రజలకు కూడా పెద్దగా న్యాయం జరిగేది కాదు. ఆ పద్ధతి ద్వారా పార్టీపై జనాల్లో నమ్మకం పోతుంది అనే ఉద్దేశానికి వచ్చారో ఏమో తెలియదు కానీ తెలుగు దేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు రూట్ మార్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు ఇవ్వడం మాత్రమే కాకుండా వారికి వారి శాఖలపై పూర్తి అధికారాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని శాఖలను ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎంతో స్వేచ్ఛగా తన మంత్రి పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అలాగే మరి కొంత మంది కూడా ఎలాంటి భయం లేకుండా పూర్తి స్వేచ్ఛగా తమ మంత్రం పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు కొత్త స్టాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రజలకు కూడా మంత్రులపై , పార్టీపై నమ్మకం చాలా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ స్ట్రాటజీ టీడీపీ పార్టీకి ఏ స్థాయిలో కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: