ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి  2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓటమిపాలయ్యారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అని వెతికే పనిలో పడ్డారు. అయితే జగన్ ఓటమికి  ముఖ్య కారకులు ఉద్యోగులు ఆ తర్వాత స్థానంలో  ఉన్నది  మీడియానే అని చెప్పవచ్చు. కేవలం సాక్షి మీడియా తప్ప మిగతా మీడియా సంస్థలన్నీ జగన్ కు వ్యతిరేకంగానే పనిచేసాయి.. మరి జగన్ ఓటమికి మీడియా  ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం.. మీడియా నిరంతరం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. జగన్ ప్రభుత్వంలో ఎవరు చిన్న తప్పు చేసినా దాన్ని ఏదో పెద్ద తప్పు అయినట్టు చూపిస్తూ వచ్చాయి. ఇందులో ముఖ్యమైన మీడియా సంస్థలు టీవీ9, ఎన్టీవీలు ఎప్పుడు కూడా జగన్ కు  యాంటీగానే వార్తలు రాసేవారు. 

ఎన్నికల చివరి సమయంలో మాత్రమే ఈ మీడియా సంస్థలను జగన్ తనవైపు తిప్పుకోగలిగారు. ఇక ఆంధ్రజ్యోతి,ఈటీవీ, టీవీ 5 చానల్స్ పూర్తిస్థాయిలో మొదటి నుంచి జగన్ కు వ్యతిరేకంగానే   పనిచేశాయి. ఈ విధంగా జగన్ క్యారెక్టర్ నుంచి మొదలు ఆయన పాలన విధానాన్ని పూర్తిగా ప్రజల్లో నెగిటివ్ చేశాయి మీడియా సంస్థలు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రతిరోజు సాక్షి టిడిపిపై వ్యతిరేక వార్తలు రాసేది. ప్రభుత్వాలపై వ్యతిరేకత సృష్టిస్తూ వచ్చిన ఛానల్  ఒక్కసారి గా జగన్ అధికారంలోకి రాగానే  అన్ని పాజిటివ్ వార్తలు రాస్తూ వచ్చింది.

అంటే టిడిపి ఉంటే పూర్తి వ్యతిరేకత ఉంటుంది, వైసిపి ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయా..ఏ పార్టీ వచ్చినా వారు చేసిన తప్పులను, చేసిన అక్రమ పనులను కూడా చూపించాలి. ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి తప్పులు చేయదు.ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి న్యాయం చేయదు..అలా సాక్షి  జగన్ గెలిచిన తర్వాత  పూర్తిగా అతనికి ఫేవర్ గా వార్తలు రాస్తూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిడిపిని కించపరిచింది.. ఇక మిగతా మీడియా ఛానలల్లో  కొన్ని అటు ఇటుగా రాస్తూ మరికొన్ని  పూర్తిగా జగన్ ను వ్యతిరేకించాయి. ఈ విధంగా జనాల్లో జగన్ అంటేనే వ్యతిరేకత వచ్చే విధంగా 70% మీడియా సంస్థలు పనిచేశాయని చెప్పవచ్చు. ఇలా మీడియా చేసిన పని జగన్ ఓటమికి ప్రధాన కారకంగా చెబుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: