2014 నుంచి 2024 వరకు వైసీపీ ఈ రెండు చోట్లా విజయకేతనం ఎగరవేయాలని ఎంతో పరితపిస్తూ వస్తోంది. ఈ నగరాల ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ చేసిన కృషి అంతా ఇంతా కాదు. అయినా ఇక్కడ విజయం దక్కించుకోలేక పోయింది. జోక్ ఏంటంటే.. ఈ రెండు నియోజకవర్గాల మధ్యలోనే జగన్ ఒక రెసిడెన్స్ ఏర్పరచుకున్నారు. ఆ రెండిటినీ బాగా డెవలప్ చేసేలాగా కూడా కనిపించారు. అయినా ప్రజలు జగన్ ను ఆదరించలేదు.
ఎంత చేసినా ఇక్కడ నుంచి గెలవడం లేదు. దీంతో ఈ రెండు స్థానాలూ తమకు అచ్చి రావడం లేదేమో అని వైసిపి నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2014లో తొలిసారి వైసీసీ అన్ని పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను నిల్చబెట్టింది. విజయవాడ, గుంటూరులో గెలుస్తామని ఆశించింది కానీ ఆ రెండు సీట్లు మాత్రం టీడీపీ నుంచి లాగేసుకోలేకపోయింది. విజయవాడలో వ్యాపార వేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేసినప్పుడు చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా ప్రజలు అతడిని కాదని టీడీపీ అభ్యర్థికే ఓట్లు గుత్తారు. దాంతో తీవ్ర అని రాసికి గురైన సదరు అభ్యర్థి రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు. 2019లో పోటీ చేసిన వ్యాపార వేత్త పీవీపీది కూడా ఓడిపోయి పాలిటిక్స్ నుంచి దూరమయ్యారు. ఇక, గుంటూరులో 2014, 2019లో టీడీపీ నుంచి గల్లా జయదేవ్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికలలో టీడీపీ నేత పెమ్మసాని అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ అచ్చి రావడం లేదని వైసీపీ నేతలు చెబుతూ ఉండటం ప్రస్తుతం చర్చినీయాంశంగా మారింది.