*ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హరికృష్ణ తిరుగులేని నాయకుడు
*ఎన్టీఆర్ అసలైన రాజకీయ వారసుడిగా ఎదిగిన హరికృష్ణ
*ఆ ముక్కుసూటి తనమే హరికృష్ణని రాజకీయాలకు దూరం చేసిందా ?
 

ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు దేశం ఏర్పాటు రాజకీయంగా సంచలనం సృష్టించింది.పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలలలోనే అధికారంలోకి  వచ్చిన ఘనత ఏ పార్టీకి కూడా లేదు. తెలుగు వాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.అనంతరం చైతన్య రథం ద్వారా రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు.9 నెలల పాటు ఎన్టీఆర్ ప్రజలతోనే మమేకం అయ్యారు.ఆ సమయంలో ఎన్టీఆర్ తన ఇంటికంటే ఎక్కువగా చైతన్య రధంలోనే గడిపారు.ఆ చైతన్య రధసారధి హరికృష్ణ .చైతన్య రధ సారధిగానే కాకుండా పార్టీ పనుల్లో కూడా హరికృష్ణ చురుకుగా పాల్గొనేవారు.దీనితో హరికృష్ణ పార్టీ నేతలకు సుపరిచితుడిగా మారారు.పార్టీ అధికారంలోకి రావడానికి హరికృష్ణ ఎంతో క్రియాశీలంగా వ్యవహరించారు.పార్టీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ వున్నా కూడా హరికృష్ణ ఏ నాడు తండ్రి మాట జవదాటలేదు.ఎన్టీఆర్ ఉన్నంత కాలం హరికృష్ణ సామాన్య కార్యకర్తగానే పని చేసారు.హరికృష్ణ పార్టీలోని కార్యకర్తలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు.అప్పట్లో ఎన్టీఆర్ తాను కూడా శ్రామికులలో ఒకరిని అని తెలిపేందుకు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఖాకి డ్రెస్ లో కనిపించారు.చైతన్య రధ సారధి అయిన హరికృష్ణ కూడా ఖాకిలోనే కనిపించేవారు.అదే వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా  కొనసాగించారు.


2009 ఎన్నికలలో ఖాకి డ్రెస్ తో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేసారు.ఎన్టీఆర్ కు హరికృష్ణ అస్సలైన రాజకీయ వారసుడిగా వున్నారు.అయితే 1995 లో చంద్రబాబు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసిన సమయంలో హరికృష్ణ చంద్రబాబు వైపు నిలిచారు.రాజ్యాంగేతర శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే  ఉద్దేశంతో హరికృష్ణ చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు .1995 లో చంద్రబాబు ప్రభుత్వంలో హరికృష్ణ రవాణా శాఖ మంత్రిగా పని చేసారు.మంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకున్న హరికృష్ణ ఆ సమయంలో తాను ఎమ్మెల్యే కాకపోవడంతో మంత్రి అయిన 6 నెలలకే రాజీనామా చేసారు. ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికలలో హరికృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందారు.ఆ సమయంలో హరికృష్ణకు మంత్రి పదవి లభించలేదు.అయితే ఆ తరువాత పార్టీలో జరిగిన పరిణామాలతో హరికృష్ణ చంద్రబాబుని విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చారు.ఆ వెంటనే అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించారు.

1999 ఎన్నికలలో అన్నతెలుగు దేశం పార్టీ తరుపున హరికృష్ణ గుడివాడ నుంచి పోటీ చేసారు.కానీ అక్కడ టీడీపీ అభ్యర్థిపై ఆయన ఓడిపోయారు.ఆ తరువాత కొన్నాళ్ళకు హరికృష్ణ అన్నతెలుగుదేశం పార్టీని తెలుగు దేశంలో  విలీనం చేసారు.సొంత పార్టీ ఓటమి తరువాత హరికృష్ణ కొన్నాళ్ళు సైలెంట్ గా వున్నారు.ఆ తరువాత 2008 లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.ప్రత్యేకంగా తెలంగాణ ఉదయం కొనసాగుతున్న వేళ దానిని వ్యతిరేకిస్తూ 2013 లో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆంధ్రప్రదేశ్ విభజనకి వ్యతిరేకంగా రాజ్యసభలో ఆయన తెలుగులో ప్రసంగించారు.ఈ ప్రసంగం తెలుగువారిని ఎంతగానో ఆకర్షించింది.ఇలా ఎమ్మెల్యే గా ,మంత్రిగా ,రాజ్య సభ ఎంపీగా హరికృష్ణ రాజకీయాలలో చెరగని ముద్ర వేశారు.వున్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా వ్యవహరించడం వల్లనే తాను ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను.ప్రస్తుతం రాజకీయంగా దూరంగా ఉండాల్సి వచ్చింది.అయిన వెనకడుగు వేసే ప్రసక్తే  లేదని హరికృష్ణ చెప్పుకొచ్చేవారు.ఇలా ఎమ్మెల్యే గా ,మంత్రిగా ,రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ చెరగని ముద్ర వేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: