తెలంగాణ రాష్ట్రంలో...  రాజకీయ నాయకులు వరుసగా పార్టీలు మారుతున్నారు. గులాబీ పార్టీ అధికారం కోల్పోవడం, ఎంపీ ఎన్నికల్లో జీరో కు పడిపోవడంతో...  ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే... ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీని వీడారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారితోపాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇటు కాలేరు  యాదయ్య కూడా మొన్న... గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పే కాంగ్రెస్లో చేరారు. ఇంకా ఐదుగురు  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జగిత్యాల ఎమ్మెల్యే.. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వివాదంగా మారింది. సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.


జగిత్యాల నియోజకవర్గం లో దాదాపు పది సంవత్సరాలుగా సంజయ్ కుమార్ తో పోరాటం చేస్తున్నానని... కాంగ్రెస్ నేతలపై  సంజయ్ కుమార్ అనేక కేసులు పెట్టాడని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతేకాదు పార్టీని వీడతానని  కూడా జీవన్ రెడ్డి హెచ్చరించారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని బుజ్జగించే ప్రయత్నం చేసింది.

ఇందులో భాగంగానే ఢిల్లీకి కూడా పిలిపించుకున్నారు సోనియా గాంధీ. ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి... అక్కడ కాస్త శాంతించారు. అయితే గులాబీ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను అసలు తీసుకోవద్దని... అధిష్టానానికి డిమాండ్ పెట్టారట జీవన్ రెడ్డి. అంతేకాకుండా గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎలాంటి పదవులు ఇవ్వకూడదని...కోరాడట జీవన్ రెడ్డి. దీంతో గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎలాంటి పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్ అని స్థానం రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చిందట. ఇతరుణంలో మంత్రి పదవులు వస్తాయని ఆశించిన కడియం శ్రీహరి... పోచారంకు నిరాశే ఎదురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS