- టీడీపీ నుంచి 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి..
- బీసీ + యంగ్ కోటాలో రాజ‌మండ్రి ఎంపీ టిక్కెట్ ఇచ్చిన జ‌గ‌న్‌
- నియోజ‌క‌వ‌ర్గంలోనూ సోష‌ల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

మార్గాని భరత్‌ రామ్ చిన్న వ‌య‌స్సులోనే టాలీవుడ్‌లో ఒక సినిమాలో హీరోగా చేయ‌డంతో పాటు ఆ వెంట‌నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రావ‌డంతోనేఏ ఎంపీ... ఆ వెంట‌నే పార్ల‌మెంటులో కీ రోల్‌... మొన్న ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా ఓట‌మి... ఇలా చాలా త‌క్కువ టైంలోనే రాజ‌కీయంగా ఉన్న‌త శిఖ‌రాల‌కు  చేరుకుని బాగా పాపుల‌ర్ అయ్యాడు భ‌ర‌త్‌. బీసీ నాయ‌కుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు కుమారుడు అయిన భ‌ర‌త్ తిరుప‌తిలో జ‌న్మించారు. సొంత ఊరు రాజ‌మండ్రిలో డిగ్రీ చ‌దివాక అమెరికాలో మేనేజ్‌మెంట్ కోర్సు చ‌దువుతున్న టైంలోనే అనేక ఫ్యాష‌న్ షోల‌లో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నాడు.


ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ లో ఓ సినిమాలో హీరోగా న‌టించే ఛాన్స్ రావ‌డంతో వెంట‌నే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఓయ్ నిన్నే అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు భ‌ర‌త్‌. ఆ సినిమాలో భ‌ర‌త్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. భ‌ర‌త్ మంచి క్రీడాకారుడు కూడా..! స్టేట్ ప్లేయర్ గా క్రికెట్ తోపాటు బ్యాడ్మింటన్, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఆటలు ఆడాడు.


2019 ఎన్నిక‌ల‌కు ముందు భ‌ర‌త్ కుటుంబం తెలుగుదేశం పార్టీలో క్రియాశీల‌కంగా ఉండేది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ అధినేత జ‌గ‌న్ రాజ‌మండ్రి పార్ల‌మెంటు సీటు భ‌ర‌త్‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఏకంగా 1.27 లక్ష‌ల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి పార్ల‌మెంటులో అడుగు పెట్టారు. వైసీపీ నుంచి చీఫ్ విప్‌గా పార్ల‌మెంటులో నియ‌మితుల‌య్యారు. ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగాను, సోష‌ల్ మీడియాలోనూ బాగా పాపుల‌ర్ అయ్యారు.


ఇక గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి సిటీని యోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓట‌మి ఎలా ఉన్నా చాలా త‌క్కువ టైంలోనే టాలీవుడ్ హీరో చిన్న వ‌య‌స్సులోనే ఎంపీ... ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం.. ఇలా భ‌ర‌త్ కెరీర్‌లో సంచ‌ల‌నాలు న‌మోదు కావ‌డంతో పాటు మంచి భ‌విష్య‌త్తు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: