ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే మాజీ మంత్రులందరికి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. అందులో భాగంగానే గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి పోటీ చేసి మాజీ మంత్రి విడదల రజనీ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. ఐతే ఆమెకి ప్రస్తుతం తన పైన ఎక్కడ కేసులు పడతాయో అని కంగారు పడుతున్నారు. తన పేరుతో వసూలు చేసిన డబ్బుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో చిలుకలూరిపేటలో ఆమె చేసిన దందాల వల్ల నష్టపోయిన వారంతా తెరపైకి వస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటి గురించి తెలిసిన వెంటనే కేసుల వరకూ వెళ్లకుండా డబ్బులు వెనక్కించేందుకు విడదల రజనీ ఒప్పందం చేసుకుంటున్నారు.సెంట్ స్థలాల పేరుతో రైతుల్ని తీసుకున్న భూముల పరిహారంలో తన అనుచరుల సాయంతో కొట్టేసినదంతా వెనక్కి ఇచ్చేశారు. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇతర బాధితులు తెరపైకి వస్తున్నారు. తమ వద్దన్న ఐదు కోట్ల డబ్బులు వసూలు చేశారని కొంత మంది స్టోన్ క్రషర్లు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అక్రమాల పేరుతో వ్యాపారాలను మూయిస్తారని బెదిరించారని.. అప్పటి అధికారులు కూడా సహకిరంచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసుల భయంతో విడదల రజనీ.. డబ్బులు తిరిగి ఇస్తూండటంతో ఇలాంటి వారంతా కేసులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో విడదల రజనీకి ఉక్కపోత ప్రారంభమయింది. ఎంత సొమ్మ అని తెచ్చివ్వాలని.. తాము ఎన్నికల్లో ఖర్చు పెట్టేసుకున్నామని గగ్గోలు పెడుతున్నారు. అయితే ఆమెపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ భయంతో ఇప్పటికే పార్టీ మార్పు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.పసుమర్రుకు సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.మంత్రిగా రజిని హయాంలో 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు రెండున్నర లక్షలు చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోను మొత్తం రూ.1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజిని తన అనుచరుల ద్వారా ముక్కు పిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పసుమర్రు రైతులు కూడా వారం రోజుల క్రితం జిల్లా ఎస్పిని కలిసి తమ వద్ద ఐదు కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఫిర్యాదు చేశారు.పల్నాడు జిల్లా యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులను బెదిరించి ఐదు కోట్లు లంచం ఇవ్వాలని రజని పిఏ దొడ్డా రామకృష్ణ 2020 లో బెదిరిoచిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పిఏ రామకృష్ణ,మరిది గోపి చెప్పింది వినాలని విజిలెన్స్ ఎస్పి జాషువా ఆ వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. చెప్పింది వినకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని పదే పదే బెదిరింపులు కూడా అధికారుల నుంచి వచ్చాయి. పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు అప్పటి విజిలెన్స్ ఎస్పి జాషువా పూర్తిగా సహకరించాడు.

తమ వద్ద అన్ని అనుమతి పత్రాలు ఉన్నాయని ప్రాధేయపడ్డా కూడా స్టోన్ క్రషర్ వ్యాపారులను వారు కనికరించలేదు. కరోనా వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్ని డబ్బులు ఇవ్వలేమని ఎస్పి జాషువాని వేడుకున్నా కూడా వ్యాపారులను వారు కనికరించలేదు. చివరికి 2కోట్ల 20 లక్షలకు రజని మరిది గోపి డీల్ సెటిల్ చేశాడు. 2021 ఏప్రిల్ లో పిఏ దొడ్డా రామకృష్ణకి రెండు కోట్లు,రజని మరిది గోపి,ఎస్పి జాషువకి చెరో పది లక్షలు వ్యాపారులు ఇచ్చారు.రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న జగన్ మోహన్ రెడ్డి బాటలో పయనించిన అప్పటి మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహించిన చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా యథేచ్ఛగా దోపిడి చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: