మిథున్‌ రెడ్డి: అరెస్ట్‌ లకు భయపడను... ప్రాణం ఉన్నత వరకు వైసీపీలోనే ఉంటానని ప్రకటించారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇవాళ హౌజ్‌ అరెస్ఠ్‌ అయినఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ... ఫలితాల తర్వాత మా కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. వారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు... ఇళ్లులు కూల్చుతున్నారని ఆగ్రహించారు.


మా వారిని  పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఎంపీగా నాకు ఉన్న అర్హత అడ్డుకుంటున్నారు... పోలీసులు నన్ను వెళ్ళద్దు అంటున్నారని మండిపడ్డారు. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. 40 శాతం మంది వైసీపీకి ఓటు వేశారని.... వీరి అందరిపై కూడా దాడులు చేస్తారా...? అని నిలదీశారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.


అధికారం శాశ్వతం కాదు..ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీరు వెళ్ళడానికి లేదు.... హౌస్ అరెస్టు చేస్తున్నాము... అని నాకు నోటీస్ ఇచ్చారని ఆగ్రహించారు. పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇలా చేస్తున్నారు...నేను బిజెపి పార్టీలోకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారని టీడీపీ పార్టీపై ఫైర్‌ అయ్యారు. చల్లా బాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్న ఇలాంటివి ఎప్పుడు లేవన్నారు.


చంద్రబాబు ట్రాప్ లో పడొద్దు అని చల్లా బాబుకు సలహా ఇస్తున్న... పోలీసులపై దాడి చేసి చల్లా బాబు జైలుకి వెళ్ళారని గుర్తు చేశారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. నేను అరెస్టుకైన, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని.. వైసీపీ పార్టీని కాపాడుకుంటానని తెలిపారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మంత్రి పదవి భద్రపరుచుకోవడం కోసం రాం ప్రసాద్ కూడా మా పై అనేక విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: