- ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు.
- సినీ రాజకీయాలను బ్యాలెన్స్ చేసిన దీరుడు.


 రెండు తెలుగు రాష్ట్రాల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియని వారు ఉండరు. నటన ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు ప్రత్యేకమైన పాత్రలు చేసుకుంటూ రెబల్ స్టార్ గా మారారు. ఆయన పేరు ముందు రెబల్ స్టార్ ఎలా వచ్చిందో, ఆయన కూడా తన జీవితంలో రెబల్ గానే బతికారు.  అలాంటి కృష్ణంరాజు పూర్వికులు రాజులు. అందుకే ఆయన పేరు తర్వాత కృష్ణంరాజు అని వస్తుంది.  అలాంటి కృష్ణంరాజు సినీ రాజకీయ జీవితం గురించి కొన్ని వివరాలు చూద్దాం.

 కృష్ణంరాజు 1940 జనవరి 20న, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1966లో చిలుకా గోరింక అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన చివరిగా రాదే శ్యాం సినిమా చేశారు. ఈ విధంగా తన కెరియర్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణంరాజు తిరుగులేని హీరోగా, రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కృష్ణంరాజు 1991 కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత బిజెపిలో చేరి 12వ లోక్సభ కు కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి  నరసాపురం లోక్సభ నుంచి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బాపిరాజుపై గెలుపొంది, వాజ్పేయి సర్కారు హయంలో కేంద్ర మంత్రి పదవిని పొందారు. 2004లో అదే లోక్సభ స్థానం నుంచి  బిజెపి తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పొందారు.

మార్చి 29లో బిజెపిని వీడి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో చేరారు. అలా సినీ, రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చినటువంటి కృష్ణంరాజు దాదాపు దశాబ్దాల పాటు సినీ రాజకీయ జీవితాలను శాసించారు. చిలక గోరింక అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు ఎన్టీఆర్ తో ఏడు సినిమాలు, ఏఎన్ఆర్ తో ఆరు సినిమాలు, శోభన్ బాబుతో 8 సినిమాలు, కృష్ణతో 21 సినిమాల్లో నటించారు. గోపి కృష్ణ మూవీ బ్యానర్ స్థాపించి పలు సినిమాలకు కూడా నిర్మాతగా చేశారు. 200 కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణంరాజు, 125 పైగా సినిమాలు హీరోగా చేశారు. ఈయనకు హీరోగా కృష్ణవేణి మూవీ మంచి విజయాన్ని అందించింది. భక్తకన్నప్పతో స్టార్ హీరోగా ఎదిగారు. కటకటల రుద్రయ్య రెబల్ స్టార్ ను చేసింది. ఈ విధంగా వీలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాజకీయ నాయకుడిగా అన్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చినటువంటి కృష్ణంరాజు సినీ రాజకీయ జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. చివరికి 83 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: