తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా... కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి కి వ్యతిరేకంగా 38 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఈ ఎమ్మెల్యేలు ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని బాంబ్‌ పేల్చారు.


రేవంత్ రెడ్డి పని తీరు పట్ల స్వంతపార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గిందన్నారు. ఆయనను స్వంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని చురకలు అంటించారు.  రేవంత్‌ రెడ్డి సీఎం కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని బాంబ్‌ పేల్చారు పెద్ది సుదర్శన్ రెడ్డి.  64 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే అందులో కేవలం 26 మంది MLAలు మాత్రమే సిఎం రేవంత్‌ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు.... 38 మంది కాంగ్రెస్ mla లు రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారన్నారు.


అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన అని దొంతు మాధవరెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు.... మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా...? అంటూ ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ రెడ్డి పై స్వంత పార్టీలో ధిక్కారం పెరిగి పోయిందని తెలిపారు.


అందుకే రేవంత్‌ రెడ్డి వర్గాన్ని పెంచుకోవడం కోసం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుతున్నారని ఆరోపణలు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో....తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది..గంటకో హత్య జరుగుతుందన్నారు. పాలన పట్టు తప్పిందని చురకలు అంటించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. స్మార్ట్ సిటీ ఫండ్ పై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: