ఏపీ రైతుల సమస్యలపై టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇవాళ గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ... నకిలీ విత్తనాలు, ఎరువులు పై ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతున్నామని వెల్లడించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అవసరమైన కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్లో 70 శాతం వ్యవసాయ ఆధారం తో జీవనం ఉంటుందని వెల్లడించారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందించాలన్న ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మార్కెట్లో కృత్రిమంగా విత్తనాల కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని... రైతులకు కావలసిన విత్తనాలు,ఎరువులు, అధికారులు అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. నకిలీ ఎరువులు, విత్తనాలపై నిఘా పెట్టాలన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.


ఎన్ని రాజకీయ వత్తులు వచ్చినా రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. మార్కెట్లో దొరికే విత్తనాల నాణ్యత పై ల్యాబ్ ల ద్వారా పరీక్షలు జరిపించాలని వెల్లడించారు. రాబోయే వర్షాకాలంలో వాటర్ మేనేజ్మెంట్ కీలకమైనదన్నారు. ఇప్పటి వరకు పూడికతో పేరుకుపోయిన,  ఇరిగేషన్ కెనాల్సును మూడు, నాలుగు వారాల్లోపు పూర్తిస్థాయిలో క్లీన్ చేపిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.


కష్టంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్దికి ప్రధాని నరేంద్ర మోడీ సహకారం అందిస్తాం అన్నారన్నారు. ఎన్నికలో ఇచ్చిన హమీల మేరకు రేపటి నుంచి పెన్షన్‌ పెంపు పథకాన్ని అమలు చేస్తూన్నామని వివరించారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెంపుకు ఐదు సంవత్సరాలు పడితే….మా ప్రభుత్వం 15 రోజులోనే వెయ్యి పెంపును అమలు చేస్తూన్నామని స్పష్టం చేశారు.  సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా ఇంటిం టికి పెన్షన్ అందిస్తామని వివరించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: