తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తోంది. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నాయకులంతా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. వంద రోజులు కాదు కదా 200రోజులు కూడా గడిచిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ని, బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఆరు గ్యారెంటీలలో కేవలం బస్సు, కరెంటు, గ్యాస్ సబ్సిడీ తప్ప, ఇప్పటివరకు   ఉద్యోగాలు, మహిళలకు 2500, ఆడపిల్లలకు స్కూటీలు,  కల్యాణ లక్ష్మితో పాటు, తులం బంగారం,  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు వారు అమలు చేయాల్సినవి ఉన్నాయి. కానీ వీటిలో ఏ పథకం గురించి  కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు అయితే ఉండడం లేదు. 

మరి ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడంతో నిరుద్యోగులు జాబుల కోసం ఎదురుచూస్తున్నారు. పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో  చంద్రబాబు సీఎంగా వచ్చిన మొదటి సంతకమే మెగా డీఎస్సీ పై పెట్టారు.  దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఏకమై ఉద్యోగాలు లేవు, ఏమి లేవు అంటూ కాంగ్రెస్ సర్కారుపై గుర్రు మీద ఉన్నారు. ఇదే విషయమై  తెలంగాణ బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ సర్కారుపై తీవ్రంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచిన  ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని హరీష్ రావు మీడియా వేదికగా విమర్శించారు.

ఆనాడు అశోక్ నగర్ కి వెళ్లి రేవంత్ రెడ్డి ఇతర నాయకులంతా  అధికారంలోకి రాగానే అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని మోసం చేశారని తెలిపారు. మరి ఇప్పుడు ఆ అశోక్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తొందరలోనే నిరుద్యోగులకు న్యాయం చేయకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమం మొదలవుతుందని, నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి కొట్లాడుతుందని అన్నారు.  అశోక్ నగర్ లో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చకుంటే మాత్రం తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు నిరుద్యోగులు ఏ విధంగా కొట్లాడారో, ఆ విధంగానే ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని  హెచ్చరించారు. ఈ విధంగా హరీష్ రావు కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ సర్కారుకు హడలు పుడుతోంది. ఒకవేళ నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే మాత్రం పరిస్థితి  నల్లేరుపై నడకే అంటూ సీఎం రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: