బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ సినీనటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్లో ఎన్నో విషయాలపై తనదైన రీతిలో స్పందించి అనేక సార్లు వార్తల్లో నిలిచింది. ఇకపోతే ఈమె జీవిత ప్రస్థానం.. సినిమా ఎంట్రీ.. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానం ఇలా అనేక వివరాలను తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో కంగనా జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఈమెను డాక్టర్ చదువు చదివించాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఈమె మాత్రం తన 16వ సంవత్సరం తన కెరియర్ను సెట్ చేసుకోవడానికి ముంబై బయలుదేరింది.

ఆ  తరువాత కొన్నాళ్ళకు కంగనా మోడల్ అయ్యారు. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006 లో గాంగ్ స్టర్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం ఈమెకు దక్కింది. ఆ తర్వాత వోహ్ లమ్హే ,  లైఫ్ ఇన్ ఎ.. మెట్రో , ఫ్యాషన్  సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూడు సినిమాలకు జాతీయ ఫిలిం.ఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు కూడా ఈమెకు అందాయి.

ఇక అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ రాజకీయాల వైపు దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈమె బీజేపీ పార్టీలో జాయిన్ అయింది. బిజెపి అధిష్టానం కూడా ఈమెను పార్టీలో చేర్చుకోవడం మాత్రమే కాకుండా ఈమెకు మంచి స్థానాన్ని కల్పించింది. అందులో భాగంగా ఈమెకు హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండీ ఎంపీ టికెట్టు ఇచ్చింది. ఈమె మొదటి ప్రయత్నంలోనే ఈ ప్రాంతం నుండి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక మొదటి ప్రయత్నంలోనే ఈమె ఎంపీ కావడంతో ఈమెకు బిజెపి పార్టీలో కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక రాబోయే రోజుల్లో ఈమె పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు అయితే ఈమెకు బిజెపి పార్టీలో కంగనాకు మంత్రి పదవి కూడా అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి చిన్న వయసులోనే ఎంపీ అయినా కంగనాకు రాజకీయంగా అద్భుతమైన కెరియర్ ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: