•నగ్మా.. పలు భాషల్లో టాప్ హీరోయిన్ గా వెలిగిన తార!

•రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఘోరంగా దెబ్బతిన్న నగ్మా!

•ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్న నగ్మా!


టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నగ్మా అసలు పేరు నందిత అరవింద్ మొరార్జీ. తెలుగు, తమిళ చిత్రాలలలో పెద్ద స్టార్ హీరోయిన్ గా నటించి ఎందరో అభిమానులని సంపాదించుకుంది నగ్మా. ఘరానా మొగుడు, కథలన్, భాషా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్లో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించి అక్కడ కూడా భారీ సినిమాలలో నటించింది. తన కెరీర్ లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, బోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషలలో స్టార్ హీరోయిన్ గా నటించింది నగ్మా. నగ్మా నేపథ్యం జైసల్మేర్ రాజరిక కుటుంబం. అంటే ఆమె పూర్వికులు రాజులు. అంతటి గొప్ప కుటుంబంలో నగ్మా పుట్టింది.ఆమె తండ్రి అరవింద్ మోరార్జీ ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళకి షిప్పింగ్, వస్త్ర, వ్యవసాయ, ఫార్మాసిటికల్ పరిశ్రమలు ఉండేవి.నగ్మా తల్లి సీమ మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతానికి చెందిన కాజీ స్వాత్రంత్రోద్యమకారుల కుటుంబానికి చెందినవారు.


నగ్మా చెల్లెల్లు కూడా ప్రముఖ హీరోయిన్లే. జ్యోతిక, రోషిణిలు తమిళ స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ధికంగా సంపన్న కుటుంబంకి చెందిన నగ్మా హీరోయిన్ గా రాణించి రాజకీయాల్లోకి వచ్చారు.నగ్మా భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతుదారురాలుగా నిలిచి న్యూఢిల్లీలో పార్టీలోనికి చేరింది. "లౌకికవాదం , పేద , బలహీన వర్గాల సంక్షేమం వైపు నిబద్ధత" అనే నినాదం ప్రేరణతో ఆమె ఆ పార్టీలోనికి చేరినట్లు అప్పట్లో తెలిపింది. తరువాత ఆమె కాంగ్రెస్ కి రాజీనామా చేసి హైదరాబాదు లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున కూడా పోటీ చేసింది.2009 లో జనరల్ లోక్‌సభ ఎన్నికలలో  తీవ్రమైన వివాదాలను ఎదుర్కొంది. రాజకీయాల్లో ఘోరంగా ఫెయిల్ అయిన నగ్మా  ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు భారత మాజీ క్రెకెటర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: