టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మాధవీలత నటిగా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలిగారు. మాధవీలత నటించిన సినిమాలు తక్కువే అయినా మంచి నటిగా మాత్రం ఆమెకు గుర్తింపు ఉంది. ఈమె యాక్టింగ్ స్కిల్స్, ప్రతిభకు నంది అవార్డులు సైతం వచ్చాయి. అయితే నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ కావడం, స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు రాకపోవడం మాధవీలత కెరీర్ పై పభావం చూపింది.
 
అయితే తర్వాత రోజుల్లో మాధవీలత రాజకీయాలపై దృష్టి పెట్టారు. 2018 సంవత్సరంలో మాధవీలత బీజేపీలో చేరగా 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అయితే 2019లో జగన్ వేవ్ ఉండటం, బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా గుర్తింపు లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఆమె ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో పాటు నాలుగో స్థానంలో నిలవడం జరిగింది.
 
శ్రీరెడ్డి చేసిన విమర్శలకు సైతం ఒకింత ఘాటుగా కౌంటర్లు ఇవ్వడం ద్వారా ఆరేళ్ల క్రితం మాధవీలత వార్తల్లో నిలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి మాత్రం మాధవీలత దూరంగా ఉండటం గమనార్హం. ఏపీలో టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయలేదనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మాధవీలతకు టికెట్ దక్కి ఉంటే ఆమె కచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేవారు.
 
ఈ ఎన్నికల్లో పెద్దగా పరిచయం లేని అభ్యర్థులు సైతం బీజేపీ తరపున ఏపీలో పోటీ చేసి విజయం సాధించారు. వాళ్లతో పోల్చి చూస్తే మాధవీలతకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న మాధవీలత రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు భావిస్తున్నారు. భవిష్యత్తులో బీజేపీ తరపున పోటీ చేసి మాధవీలత లక్ పరీక్షించుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే మాధవీలత పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న మాధవీలత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని లుక్స్ పరంగా ఆమెలో పెద్దగా మార్పు రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: