•హాట్ హీరోయిన్ గా టాలీవుడ్లో పలు సినిమాలు చేసిన నవనీత్ కౌర్!
•మోడల్ నుంచి పొలిటిషియన్ గా టర్న్ అయ్యి లైట్ లోకి వచ్చిన నవనీత్!
•పొలిటికల్ స్పీచులతో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న నవనీత్ కౌర్!

( అమరావతి - ఇండియా హెరాల్డ్) : నవనీత్ కౌర్ రానా అంటే ఒక రాజకీయవేత్త అనుకుంటారు కానీ ఆమె ప్రధానంగా తెలుగు సినిమాలో నటించిన మాజీ నటి. మహారాష్ట్రాలోని పంజాబి ఫ్యామిలీలో పుట్టిన ఆమె ఇంటర్ దాకా చదువుకొని  మోడలింగ్ కెరీర్ వైపు వెళ్ళింది. మోడల్ గా ఉన్న టైంలో ఆరు మ్యూజిక్ వీడియోలలో నటించింది. నవనీత్ కౌర్ తెలుగు సినిమా శీను వాసంతి లక్ష్మి (2004) సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఆ తరువాత కన్నడ, తమిళ్,మలయాళం, పంజాబి సినిమాలు కూడా చేసింది. కానీ ఎక్కువ సినిమాలు తెలుగులో చేసింది. తెలుగులో పలు సినిమాలు చేసి హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ స్టార్ హీరోయిన్ గా తన మార్క్ క్రియేట్ చేసుకోలేదు. చాలా కాలం పాటు తెలుగులో హీరోయిన్ గా హాట్ రోల్స్ చేసింది కానీ స్టార్ కాలేకపోయింది. ఆమె సినిమా జీవితం నుండి కొద్దికాలం విరామం తీసుకున్న తర్వాత, 3 ఫిబ్రవరి 2011న, ఆమె మహారాష్ట్ర అమరావతి నగరంలోని బద్నేరా నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అయిన రవి రాణాను వివాహం చేసుకుంది. దీంతో ఇక సినిమాలు చెయ్యడం వేస్ట్ అనుకోని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అలా ఆమె 2019 లోక్‌సభ ఎన్నికలలో అమరావతి నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై పార్లమెంటు సభ్యురాలుగా(MP) పని చేసింది. కానీ 2024 లో మాత్రం ఆమె బిజెపి టిక్కెట్‌పై పోటీ చేసి, అమరావతి నియోజకవర్గం నుండి 19,731 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ సభ్యుడు బల్వంత్ వాంఖడే చేతిలో ఓడిపోవడం జరిగింది.రవి రాణాతో వివాహం తర్వాత , ఆమె 2014 వ సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విఫలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికలలో నవనీత్  మహారాష్ట్రలోని అమరావతి నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్‌ను ఓడించింది.ఆమె ఎప్పటికప్పుడు శివసేన పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగే వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేవి. ఆమె ఓడిపోయినా కానీ ఆమె స్పీచులకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ ఫిదా అవుతున్నారు. దీంతో హాట్ హీరోయిన్ గా కంటే కూడా స్టార్ పొలిటిషియన్ గా ఆమె గుర్తింపు పొందింది. లైట్ లోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: