ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. దీని తర్వాత వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కూటమిలో భాగంగా చాలామంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ఇరుక్కున పెట్టాలని చూశారు. ఈ మేరకు కాంగ్రెస్ హై కమాండ్ తో జగన్ చర్చలు జరుపుతున్నారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి.. టిడిపి ,బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాల పైన చాలా రకాలుగా ఆరోపించారు. ముఖ్యంగా వైయస్ కుటుంబానికి మంచి స్నేహితుడుగా ఉన్న కర్ణాటక పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా ఈ విషయాన్ని పంపచేయాలనుకున్నారనే విధంగా ప్రచారం వినిపించింది.



ఇప్పటికే జగన్ డీకే శివకుమార్తో ఒకసారి భేటీ అయ్యారని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి అంటూ పలువురు నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. డీకే జగన్ భేటీ వార్తలు పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారడంతో ఈ విషయంపైన డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.. జగన్ తో భేటీ వార్తలను ఆయన ఖండించారు.. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశాలు జరగలేదంటూ మేమిద్దరం భేటీ అయినట్లుగా కేవలం తప్పుడు వార్తలని ఎవరో సృష్టించి రాశారని తెలిపారు.


నేను జగన్ అసలు బేటి కాలేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మకండి అంటూ తెలిపారు.. డీకే రెస్పాండ్ కావడంతో ఈ భేటీ వార్తలకు ఒకసారిగా చెక్ పడిందని చెప్పవచ్చు. టిడిపి నేతలు కావాలని వైసిపి పార్టీ, కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తారంటూ పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నారనే విధంగా వైరల్ గా చేశారు. దీంతో తాను జగన్ తో భేటీ కాలేదని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు మరొకసారి ఈ విషయం చర్చనీయాంశంగా  మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: