- నల్లగా ఉందని హేళన చేసిన గడ్డపైనే స్టార్ గా ఎదిగింది..
- 90S లో కుర్రకారుకు కలల రాణి..
- సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన రాధికకు రాజకీయాలు కలిసి రాలేదా..

 రాధిక పేరు చెప్పగానే చాలామందికి ఇండస్ట్రీలో గుర్తుకు వచ్చేది చిరంజీవి మాత్రమే. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించి  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి రాధిక చిరంజీవి నటించిన సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే కన్నార్పకుండా చూస్తుంటారు. అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రాధిక  జననం, రాజకీయ జీవితం గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం.

 సినీ ప్రస్థానం:
సీనియర్ హీరోయిన్ రాధిక ఎమ్మార్ రాధా మరియు గీతాల కుమార్తె. తండ్రి తెలుగు, చెన్నైకి చెందిన వ్యక్తి అయితే, తల్లి శ్రీలంక తమిళ ప్రాంతానికి చెందినది. దీంతో రాధిక తన విద్యాభ్యాసాన్ని ఇండియాలోనే కాకుండా శ్రీలంక, లండన్ లో పూర్తి చేసింది. ఈమెకు ఒక చెల్లెలు నిరోషా కూడా ఉంది. అలాగే ఇద్దరు తమ్ముళ్లు రాజు, మోహన్ లు ఉన్నారు. అలాంటి రాధిక 1963 ఆగస్టు 21న జన్మించారు. అలాంటి రాధిక లండన్ లో చదువుకున్న సమయంలో తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని చదువు మధ్యలోనే విడిచిపెట్టి ఇండియాకు వచ్చింది. ఈ సమయంలోనే ఆమెను డైరెక్టర్ భారతి రాజా చూశారట. వెంటనే ఆమెకు కిజకి పోగుంటై అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అలా 1978 విడుదలైన ఈ సినిమాలో కమెడియన్ సుధాకర్ హీరోగా చేశారు. ఈ సినిమాను తెలుగులో తూర్పు వెళ్ళే రైలు గా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా సుధాకర్ తోనే నటించింది. కానీ ఆ రెండు సినిమాలు కాస్త ఎక్కువగా హిట్ కాకపోవడంతో కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో మంచి ఆఫర్స్ వచ్చాయి. అలా హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఎన్నో చిత్రాల్లో చేసుకుంటూ వచ్చింది రాధిక. ఈమె తెలుగులో మొదటిసారి నటించిన సినిమా ప్రియా..ఇందులో చిరంజీవి హీరోగా చేశారు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత చిరంజీవితో న్యాయం కావాలి సినిమాలో మళ్లీ నటించింది. ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యి ఆమెకు నంది అవార్డును కూడా తెచ్చి పెట్టింది. అలా చిరంజీవితో మొత్తం 22 సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఈమె కేవలం సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా చాలా సినిమాలకు నిర్మాతగా కూడా చేసింది.

 వ్యక్తిగత జీవితం:
 ఈమె తమిళ నటుడు ప్రతాప్ ను పెళ్లి చేసుకుంది.కానీ కొన్ని విభేదాల కారణంగా వీరు వీడిపోయారు.  ఆ తర్వాత బ్రిటన్ కు చెందిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ళకి ఒక అమ్మాయి కూడా పుట్టింది. కానీ వీరి మధ్య కూడా సఖ్యత కుదరకపోవడంతో విడాకులు తీసుకున్నారు. అలాంటి ఈమె శరత్ కుమార్ ను 2001లో వివాహం చేసుకుంది.
 
 రాజకీయ జీవితం:
 శరత్ కుమార్ ద్వారానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాధిక, శరత్ కుమార్ కరుణానిధి అన్నా డీఎంకే పార్టీలో చేరి  1996లో ఎన్నికల్లో పోటీ చేశారు. కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత శరత్ కుమార్ రాజ్యసభ ఎంపీగా కూడా ఒకసారి గెలుపొందారు. ఆ తర్వాత 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నా డీఎంకే పార్టీలో రాధికను కూడా చేర్పించారు శరత్ కుమార్. కానీ ఈమె 2006 అక్టోబర్ లో పార్టీ వ్యతిరేక పనులు చేస్తుందని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో శరత్ కుమార్, రాధిక పార్టీని విడిచిపెట్టారు. ప్రస్తుతం రాధిక పలు సినిమాల్లో  తల్లి, వదిన,  అమ్మమ్మ క్యారెక్టర్లు చేసుకుంటూ  ముందుకు వెళ్తోంది. అలాగే 2024 ఎన్నికల్లో బిజెపిలో చేరి తమిళనాడు విరుద్ నగర్ లోక్ సభ స్థానం నుండి రాధిక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ఇలా సినిమాల్లో సక్సెస్ అయిన రాధిక రాజకీయాల్లో సక్సెస్ కాలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: