సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది.. ఎందుకంటే రాజకీయ నాయకులుగా చేసిన వారు సినిమాల్లోకి రావడం చూడలేదు. కానీ సినిమాల్లో స్టార్లుగా ఎదిగిన వారు ఎంతో మంది ప్రజా సేవ చేయాలని  పొలిటికల్ మంత్రం అందుకోవడం ఇప్పుడు కాదు కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి 9 నెలల సమయంలోనే కొత్త పార్టీని పెట్టి ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. అయితే కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా రాజకీయాల్లో సత్తా చాటారు.


 జయలలిత లాంటి హీరోయిన్లు ఎంతోమంది అటు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అయితే నిన్నటి తరం నేటి తరంలో కూడా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కొంతమంది సినిమాల్లో లాగా పాలిటిక్స్ లో సక్సెస్ సాధించలేక పోతే.. ఇంకొంతమంది మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. ఇలా సక్సెస్ అయిన వారిలో రచన బెనర్జీ కూడా ఒకరు. ఈమె 1991 లో మిస్ కోల్కత కిరీటాన్ని ధరించారు.  1993లో దాస్ ప్రతిదాస్ అనే బెంగాలీ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తమిళ కన్నడ హిందీ ఒడియా భాషల్లో నటించారు. 1997లో నేను ప్రేమిస్తున్నాను అనే సినిమా తెలుగు తెరకు పరిచయమైన రచన బెనర్జీ.. కన్యాదానం అనే రెండో సినిమాతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత మావిడాకులు, అభిషేకం, బావగారు బాగున్నారా, రాయుడు, సుల్తాన్, పిల్ల నచ్చింది ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


 తర్వాత టాలీవుడ్కు దూరమైన ఇతర భాషల్లో మాత్రం సినిమాలు చేస్తూనే వచ్చారు. అయితే దీది నెంబర్ వన్ అనే షోతో వ్యాఖ్యాతగా కూడా సత్తా చాటారు ఆమె. కాగా ఇటీవల ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మొదటి ప్రయత్నంలోనే సిక్సర్ కొట్టేశారు. తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో హుగ్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన రచన బెనర్జీ సమీప ప్రత్యర్థి  అయిన బిజెపి అభ్యర్థి లాకెట్ చటర్జీ పై 76,853 కోట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఇక ఎంపీగా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టి ప్రజల తరఫున గలాన్ని వినిపించబోతున్నారు. మరి ఈమె రాజకీయాల్లో ఎలా సక్సెస్ సాధించబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: