* 2019లో పార్లమెంటుకు సుమలత  
* ప్రస్తుతం బిజెపిలో కీలక పాత్ర!
*  స్వతంత్ర అభ్యర్థిగా అఖండ  విజయం
* కర్ణాటక లో కీలక నేత

రాజకీయాలకు అలాగే సినిమా పరిశ్రమకు దగ్గరి సంబంధం ఉంటుంది. చాలామంది సినీ సెలబ్రిటీలు... రాజకీయాల్లోకి రావడం మనం చూస్తున్నాం. అలా కొంతమంది... సినిమా సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు.  అయితే సినిమాలలో హీరోయిన్ గా చేసి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారిలో సుమలత ఒకరు.

 తన సినిమా కెరీర్ ప్రారంభంలో హీరోయిన్గా నటించిన సుమలత... ఆ తర్వాత రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. దాదాపు 220 కి పైగా సినిమాలు చేసిన సుమలత... ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ నటించింది. ఇలా దేశవ్యాప్తంగా... సినిమాల ద్వారా పాపులర్ అయిన  సుమలత..తన భర్త అంబరీష్ మరణించిన తర్వాత ఎన్నికల్లో  పోటీ చేసి సక్సెస్ అయ్యారు.

2019  పార్లమెంట్ ఎన్నికల సమయంలో... కర్ణాటక లోని మండ్యా.. పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు సుమలత. ఈ సందర్భంగా... కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు  నిఖిల్ గౌడప్ప ఏకంగా లక్ష్యం మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు సుమలత. అయితే ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం... కన్నడ సూపర్ స్టార్లు అయిన యాష్, దర్శన్, దొడ్డన్న లాంటి సినీ ప్రముఖులు పనిచేశారు.


ఈ తరుణంలోనే...  కర్ణాటక నుంచి పార్లమెంటుకు ఇండిపెండెంట్ ఎంపీ గా ఎన్నికైన మహిళగా సుమలత రికార్డు సృష్టించారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల కంటే ముందు... అంటే మొన్న... బిజెపి తీర్థం పుచ్చుకున్నారు సుమలత. ప్రస్తుతం బిజెపి పార్టీలోనే ఉంటూ...  తన రాజకీయ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో... కుమారస్వామికి... మాండ్యా నియోజకవర్గాన్ని మోడీ అప్పగించారు. దీంతో మాండ్య నియోజకవర్గంలో కుమారస్వామి కి సపోర్ట్ చేశారు సుమలత.

మరింత సమాచారం తెలుసుకోండి: