ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం తొలి అడుగు స‌క్సెస్ ఫుల్‌గా వేసింది. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీ మేర‌కు.. రాష్ట్రంలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను పంపిణీ చేస్తున్నా రు. అవికూడా.. రూ.1000 పెంచ‌డంతోపాటు..ఏప్రిల్ నుంచి ఉన్న మూడు మాసాల‌కు కూడా పెంచి ఇస్తు న్నారు. ఇది ఒక‌ర‌కంగా పెను భార‌మే. ఈ తొలి విజ‌యం ఖ‌రీదు అక్ష‌రాలా 4,456 కోట్ల రూపాయ‌లు. దీనిని పింఛ‌న్ల రూపంలో ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేస్తున్నారు.


ఇంత సొమ్ము పింఛ‌న్ల రూపంలో పంపిణీ చేయ‌డం దేశంలోనే తొలిసారి. ఒకేసారి రూ.4,456 కోట్ల‌ను పంపి ణీ చేస్తున్న ఏకైక స‌ర్కారుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిలుస్తుంది. అయితే.. ఈ సొమ్మును ఒక‌ర‌కంగా చెప్పాలంటే. వెలిగొండ ప్రాజెక్టు పూర్త‌య్యేంత‌ సొమ్ము. లేదా ప‌ది గ్రామాల‌కు ర‌హ‌దారుల‌ను నిర్మించేంత సొమ్ము. అయిన‌ప్ప‌టికీ.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి చంద్ర‌బాబు ఈ విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకా దు.. చంద్ర‌బాబు ఈ విష‌యంలో సంప్ర‌దాయాన్ని కూడా పాటిస్తున్నారు.


గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో పింఛ‌న్ల‌ను ఆఫీసుల‌కు పిలిచి ఇచ్చేవారు. కానీ, జ‌గ‌న్ అదికారంలో ఉన్న‌ప్పుడు.. ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు.. సూర్యోద‌యం కూడా కాక‌ముందే.. పింఛ‌న్లు ల‌బ్ధిదారుల త‌లుపు త‌ట్టేవి. అయితే.. ఈ సంప్ర‌దాయం త‌న‌కే సొంత‌మ‌ని.. రేపు చంద్ర‌బాబు వ‌స్తే.. మీరు మ‌ళ్లీ ఆఫీసుల చుట్టూ.. బ్యాంకుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పారు. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు మాత్రం ప‌ద్ధ‌తిని కొన‌సాగిస్తున్నారు.


జ‌గ‌న్ అమ‌లు చేశాడ‌న్న కోపం కానీ. ఈర్ష్య‌కానీ ఆయ‌న‌లో క‌నిపించ‌డం లేదు. అందుకే.. ఆయ‌న ఇంటిం టికీ పింఛ‌ను పంపిస్తున్నారు. పైగా.. ఉద‌యం 6 గంట‌ల నుంచి 8 గంట‌ల మ‌ధ్య పింఛ‌న్ల పంపిణీ పూర్తి చేయాల‌ని కూడా ఆదేశించారు. త‌ద్వారా.. జ‌గ‌న్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డ‌న్న‌.. నానుడిని.. ప్ర‌చారాన్ని చంద్ర‌బాబు చెరిపేసి.. నేను అంత‌క‌న్నా బాగానే చేయ‌గ‌ల‌ను! అన్న మాట‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు గ్రాఫ్ ర‌య్ ర‌య్‌న దూసుకుపోతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: