- ఎన్టీఆర్‌, ఏఎన్నార్ అయినా జ‌మున‌కు ఐ డోన్ట్ కేరే
- 1989లో రాజ‌మండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపు
- క‌ర్నాట‌క హంపిలో పుట్టి టాలీవుడ్‌లో ఒదిగిన హీరోయిన్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

జ‌మున ... ఎన్టీఆర్‌, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి న‌టించే హీరోయిన్‌.. జ‌మున ఎప్పుడూ కూడా అటు ప‌క్క‌న ఎంత పెద్ద హీరో ఉంటే నాకేంటి... అన్న‌ట్టుగా ఉండేవార‌ట‌. అందుకే ఒకానొక టైంలో ఆమె బాగా యాటిట్యూడ్ చూపిస్తుంద‌నే భావ‌న‌తో ఏఎన్నార్ .. ఎన్టీఆర్‌తో చెప్ప‌డంతో ఆమెకు యేడాది పాటు ఛాన్సులు ఇవ్వ‌లేద‌న్న ప్ర‌చారం కూడా అప్ప‌ట్లో టాలీవుడ్‌లో జ‌రిగింది. జ‌మున ఓ మ‌గ‌రాయుడిలా ఉంటార‌న్న పేరు కూడా ఉంది.

ఇక జ‌మున స్వ‌స్థ‌లం క‌ర్నాక‌ట‌లోని హంపి. అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కు తరలిరావడంతో ఆమె బాల్యం అంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జానాబాయ్. ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు. జమున స్కూలులో చదివేరోజుల్లోనే నాటకాలవైపు ఆక‌ర్షితురాల‌య్యారు. ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి స్టార్ హీరోయిన్ అయ్యారు.


తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆ త‌ర్వాత ఆమె 1980లో అప్ప‌ట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉండగా... కాంగ్రెస్‌లో చేరారు. 1989 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు దూర‌మైనా కూడా బీజేపీ త‌రపున ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు.


సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా... ఎన్టీఆర్‌, ఎన్నార్‌తో పోటీ ప‌డినా కూడా .. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని కాద‌ని.. కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచినా కూడా ఆమె సింగిల్ టైం ఎంపీగా చ‌రిత్ర‌లో మిగిలిపోయారు. అంత‌కు మించి ఆమె రాజ‌కీయంగా చూపించిన ప్ర‌భావం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: