ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పెంపు వ్యవహారం పైన తన మొదటి సంతకాన్ని చేయడం జరిగింది. అన్నట్టుగానే ఒకటవ తారీఖున పింఛన్ చంద్రబాబు నాయుడు స్వయంగా అందించారు. ముఖ్యంగా పెనుముకలోని ఎస్టీ కాలనీలో ఉంటున్న  పాముల నాయక్ కు వృద్ధాప్య పింఛన్ తో పాటుగా.. తన భార్యకు సిఆర్డిఏ పెన్షన్.. అలాగే  కుమార్తె వితంతు పెన్షన్ డబ్బులను సైతం అందజేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారుల యొక్క సమస్యలను కూడా తెలుసుకొని వారితో మాట్లాడడం జరిగింది.


లబ్ధిదారులు తమకు ఇల్లు కావాలని నాయక్ కుటుంబం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ని కోరడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు కూడా వీరికి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్ ని కేవలం 3000 రూపాయలు ఉండగా 4వేల రూపాయలకి పెంచారు అలాగే ఏప్రిల్ నెల నుంచి ఇవ్వవలసిన పింఛన్ పెంపు వ్యవహారాన్ని కూడా అంతా కలిపి ఈనెల 7వేల రూపాయలు అందించారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో పింఛన్ల పండగ మొదలయింది.. అలాగే వికలాంగులకు సైతం 6వేల రూపాయలు అందించినట్లుగా తెలుస్తోంది.


ఏది ఏమైనా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే పింఛన్ పెంపుని మొదటి నెలకే అమలు చేయడం జరిగింది.. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరలోనే అమలు చేస్తామని.. ఇళ్ల స్థలాల పైన కూడా కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకొని వాటి యొక్క పరిశీలనలతో ప్రజలకు అందిస్తామని కూడా తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం పైన కూడా రద్దు చేశామని తెలియజేయడం జరిగింది. అలాగే మెగా డీఎస్సీ పైన కూడా సంతకం చేశానని వెల్లడించారు..మరి రాబోయే రోజుల్లో కూటమిలో భాగంగా మరిన్ని హామీలను నెరవేర్చి ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: