2024 పార్లమెంట్ ఎన్నికల్లో... విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టింది. 400 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటానని చెప్పిన బిజెపి... కేవలం 240 కి పరిమితమైంది. సొంతంగా బిజెపి 240 సీట్లు గెలుచుకోగా... ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిసి... 294 కు చేరుకుంది. ఈ తరుణంలోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది ఎన్డీఏ కూటమి. అయితే ఈసారి... ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాంతీయ పార్టీల అవసరం బాగా వచ్చింది.


తెలుగుదేశం పార్టీ అలాగే నితీష్ కుమార్ పార్టీ రెండు పార్టీలు.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటు సజావుగా జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ 16 సీట్లు గెలుచుకోగా... జెడియు  12 సీట్లతో  కేంద్రంలో చక్రం తిప్పింది. నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు సపోర్ట్ తో... మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ.
దీంతో ఏపీకి అటు బీహార్ కు ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం ప్రారంభించేసింది మోడీ ప్రభుత్వం. అయితే తాజాగా... ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్... తెరపైకి వచ్చింది.


కానీ ఈ విషయంపై నితీష్ కుమార్ మాత్రం చాలా బలంగా తన గలాన్ని వినిపిస్తున్నారట. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని... లేకపోతే బయటకు వెళ్తానని కూడా ఇండైరెక్టుగా హెచ్చరిస్తున్నారట. ఎప్పుడు ఢిల్లీకి వెళ్లిన ఇదే పాట పాడుతున్నారట నితీష్ కుమార్. అయితే నితీష్ కుమార్ కారణంగా చంద్రబాబు ఇరుకున పడుతున్నారని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా నే కాకుండా... రాజధానికి ప్రత్యేక నిధులు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, పోలవరం నిధులు, ఏపీకి ప్రత్యేకంగా ప్యాకేజీ ఇలా చాలానే ఉన్నాయి.  వీటన్నిటిని అడిగే క్రమంలో ప్రత్యేక హోదా కూడా అడగాలి.


ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అంశాన్ని పక్కకు పెట్టి మిగతా అంశాలను చంద్రబాబు అడుగుతున్నారట. కానీ నితీష్ కుమార్ మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందేనని భీష్మించుకొని కూర్చున్నారట. నితీష్ కుమార్ ఇలా అడుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఎందుకు అడగడం లేదని ఏపీలో ఉన్న ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కమ్యూనిస్టులు కూడా ఎదురు దాడి చేస్తున్నారు. మరి ప్రత్యేక హోదా అంశంపై  చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: