ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసుకొని ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అనంతరం... పార్టీ కోసం పనిచేసిన నాయకులకు... చంద్రబాబు నాయుడు కీలక పదవులు కూడా ఇచ్చారు. సీనియర్లకు కాకుండా ఈసారి జూనియర్లకు... మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అటు జనసేనకు మూడు పదవులు దక్కాయి. బిజెపి పార్టీకి ఒకే ఒక్క మంత్రి పదవి రావడం మనం చూసాం.


అయితే తెలుగుదేశం పార్టీలో చాలామంది... లీడర్లు పదవులు రాక అసంతృప్తితో ఉన్నారు.సీనియర్ లీడర్లకు పదవులు రాకపోవడంతో... చంద్రబాబుపై కొంతమంది  కూడా అలిగారు. అందులో ఆమదాలవలస శాసనసభ్యులు  కూన రవికుమార్ కూడా ఉన్నారు. కూన రవికుమార్ ఈసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తమ్మినేని సీతారాంపై దాదాపు 30 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు కూన రవికుమార్.

 

జగన్మోహన్ రెడ్డి పాలనలో.. వైసీపీని తమ్మినేని సీతారాం ఒక ఆట ఆడుకున్నారు. అలాంటి సీతారాం ను... గద్దదించారు కూన రవికుమార్. గతంలో కూడా... కూన రవికుమార్ ఆయన పై విజయం సాధించారు. 2014 సంవత్సరంలో విజయం సాధించిన కూన రవికుమార్ కు  ప్రభుత్వ విప్ ఇచ్చారు. అయితే ఈసారి గెలిచిన రవికుమార్ కు.... కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరికి రవికుమార్ కు మొండి చేయి చూపించారు చంద్రబాబు నాయుడు.

అయితే... కూన రవికుమార్ కు ప్రత్యేక సెక్యూరిటీని చంద్రబాబు పంపించారట. కానీ ఆ సెక్యూరిటీని... తిరిగి వెనక్కి పంపించారట రవికుమార్. తనకు మంత్రి పదవి ఇవ్వలేదు కానీ.. ఆయన సెక్యూరిటీ ఎందుకు అనే అర్థం వచ్చేలా రవికుమార్  ఇలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో రవికుమార్ భార్యకుఓ చేదు అనుభవం ఎదురయింది. అందుకే చంద్రబాబు సెక్యూరిటీని పంపించారు. కానీ రవికుమార్ మాత్రం దాన్ని రిజెక్ట్ చేశారు. మరి భవిష్యత్తులో ఆయన రవికుమార్ కు మంచి పదవి వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: