ఈ ఘ‌ట‌న యాదృచ్ఛిక‌మే అయినా.. అప్ప‌ట్లో జ‌గ‌న్‌.. ఇప్పుడు చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఒకే గ్రామంపై కాన్స‌న్‌ట్రేట్ చేయ‌డం మాత్రం ఆశ్చ‌ర్యంగానే ఉంది. తాజాగా జూలై 1న చంద్ర‌బాబు ఎన్టీఆర్ భ‌రోసా.. సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల పంపిణీని పండుగ‌లా ప్రారంభిం చారు. ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన హామీ మేర‌కు పింఛ‌న్ల‌ను రూ.3000 నుంచి రూ.4000ల‌కు పెంచ‌డంతోపాటు.. ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు రూ.1000 చొప్పున బ‌కాయిని కూడా క‌లిపి ఇస్తున్నారు. అంటే అవ్వాతాత‌ల‌కు.. రూ7000 చొప్పున చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు పంపిణీ చేస్తోంది.


దీనిని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ మాదిరిగా నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. దీనిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు కూడా పాల్గొనాలని ఆయ‌న ఆదేశించారు. అయితే.. ఇక్క‌డితో క‌థ అయిపోలేదు. తానే స్వ‌యంగా ఈ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చంద్ర‌బాబు ప్రారంభిస్తున్నారు. తొలి ల‌బ్ది దారునికిచంద్ర‌బాబు స్వ‌యంగా పింఛ‌నును అందించ‌నున్నారు. అయితే.. ఆయ‌న ఎంచుకున్న గ్రామం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో ఉన్న పెనుమాకలో చంద్ర‌బాబు తొలి పింఛ‌ను అందించ‌నున్నారు.


ఇక్క‌డి ఓ వితంతువుకు, ఆమె తండ్రికి చంద్ర‌బాబు రూ.7000 చొప్పున రూ. 14 వేల‌ను అందించ‌నున్నారు. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. గ‌తంలో వైసీపీ సర్కార్ లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇక్కడ నుంచే అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభించారు. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఇదే గ్రామం నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నారు. రెండు వేరు వేరు కార్యక్రమాలు అయినా నాడు జగన్‌, నేడు చంద్రబాబు పెనుమాకనే ఎంచుకోవటం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.


రాజధాని అమరావతిలో పెనుమాక‌ ఒక గ్రామం. దానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వటంలో మర్మం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటనేది ఆస‌క్తిగా మారింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌, నేటి ముఖ్యమంత్రి చంద్ర‌బాబులు ఇద్ద‌రూ మరే ఇత‌ర గ్రామం ఎంచుకోకుండా తొలి పథకం పెనుమాక నుంచే ప్రారంభించ‌టంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. వారు ఏ కారణంలతో రాజకీయ కోణంలో పెనుమాకలో  పథకాలు ప్రారంభిస్తున్నారో.. అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి చూడాలి దీనివెనుక ఏం ఉందో.. అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: