- క‌ళ్యాణ్‌రామ్ అభిమ‌న్యు సినిమాతో తెలుగుకు ప‌రిచ‌యం
- 6 నెల‌ల ఎంపీగా క‌న్న‌డ న‌టి ర‌మ్య‌.. అక్క‌డితో స‌రి
- రాహుల్‌గాంధీ టీంలో ఉన్నా ముద్ర వేయ‌లేక‌పోయారే..

(  రాయ‌ల‌సీమ - ఇండియా హోరాల్డ్ )

క‌న్న‌డ న‌టి దివ్య స్పంద‌న‌... అలియాస్ ర‌మ్య అంటే అంద‌రికి తెలిసిన హీరోయినే. ఆమె క‌న్న‌డ అమ్మాయి.. హీరోయిన్ అయ్యాక త‌న పేరు ర‌మ్య‌గా మార్చుకున్నారు. చూడ‌డానికి అందంగానే క‌నిపిస్తుంది... అందంతో పాటు చ‌క్క‌ని అభిన‌యం ఉన్నా కూడా ఎందుకో గాని హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. దివ్య స్పంద‌న స్క్రీన్ నేమ్ ర‌మ్య‌. ర‌మ్య కెరీర్ స్టార్టింగ్ లోనే నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా అభిమ‌న్యు సినిమాలో న‌టించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు.


ఆ త‌ర్వాత ఆమె త‌న తండ్రి వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి రావాల్సి వ‌చ్చింది. ర‌మ్య తండ్రి క‌న్న‌డ నాట ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు.. ఆయ‌న మండ్య నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీగా ఉండ‌గానే హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. దీంతో ఆమె 2013లో జ‌రిగిన మండ్య లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి చిన్న వ‌య‌స్సులోనే ఎంపీగా విజ‌యం సాధించారు. విచిత్రం ఏంటంటే ఆమె ఆరు నెల‌లు మాత్ర‌మే ఎంపీగా ఉన్నారు.


2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో మండ్య నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేసి ఆమె బీజేపీ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌లేదు.. అలా కేవ‌లం ఆరు నెల‌ల ఎంపీగా ఆమె మిగిలిపోయారు. ఇక అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019లో మ‌రో సీనియ‌ర్ హీరోయిన్ సుమ‌ల‌త బీజేపీ స‌పోర్టుతో పోటీ చేసి ఇండిపెండెంట్‌గా విజ‌యం సాధించారు. ఆమె జేడీఎస్ నుంచి పోటీ చేసిన క‌న్న‌డ యంగ్ హీరో నిఖిల్ కుమార్ గౌడ చేతిలో ఓడిపోయారు.


2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ర‌మ్య రాహుల్ గాంధీ టీంలో కీల‌క‌మ‌య్యారు. కాంగ్రెస్ పార్టీ డిజిట‌ల్ వింగ్ అధ్య‌క్షురాలిగా ఆమెను రాహుల్ నియ‌మించారు. అందులోనూ ఆమె త‌న‌దైన ముద్ర వేయ‌లేక త‌ప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె నిర్మాత‌గానే కాకుండా.. తిరిగి సినిమాల్లో ఆడ‌పా ద‌డ‌పా న‌టిస్తున్నారు. ర‌మ్య‌కు ఇంకా వివాహం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: