ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాదాపు 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి... సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా... డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.... ప్రమాణ స్వీకారం చేశారు. అటు మొత్తం 24 మంది...కేబినెట్ మంత్రులుగా... ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు.... జనసేనకు అన్యాయమే జరుగుతోందని... సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది.  21 స్థానాలు ఉన్న జనసేనకు మంత్రి పదవులుమాత్రమే రావడం, కేంద్రంలో అసలు ప్రాధాన్యత లేకుండా పోవడం... జనసేనను వేధిస్తున్నాయి. ఇక ఇటు... మంత్రి పదవుల్లో కూడా ప్రాధాన్యత లేని పదవులు ఇచ్చారని కూడా చర్చ జరుగుతోంది.

వీటన్నిటికంటే...  ఏపీలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వరుసగా అవమానాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో...  అసలు పవన్ కళ్యాణ్ కు ఎక్కడ కూడా ప్రాధాన్యత కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ కనిపించడం లేదు. మొన్న రామోజీరావు...సంస్కరణ సభ కోసం ఇచ్చిన యాడ్లో... ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడ కనిపించలేదు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ జరిగింది.

అయితే లేటెస్ట్ గా  మరోసారి పవన్ కళ్యాణ్ కు... అవమానం జరిగిందని ఈ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు,  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.  ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో చంద్రబాబుతో సహా మంత్రులందరూ ఈ పంపిణీ కార్యక్రమాలలో తమ తమ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో కూడా.. పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించలేదు. కేవలం చంద్రబాబు ఫోటో మాత్రమే ఉండడంతో పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. దీనిపై చంద్రబాబు వెంటనే.. అప్రమత్తం కాకపోతే.. పైన ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: