ఏపీలో ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు..గడిచిన కొన్ని గంటల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.. మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ఈ పింఛన్ల పంపిణీ సైతం ప్రారంభించారు. గ్రామంలో ఉండే ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా చంద్రబాబు నాయుడుని అందించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో సహా పలువురు పాల్గొనడం జరిగింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గెలుపు పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ గెలుపు పైన స్పందిస్తూ గత ఎన్నికలలో లోకేష్ ఓడిపోయి మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు ప్రజలందరూ అభిమానం చూసే లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేసి అఖండ మెజారిటీతో మంచి విజయాన్ని అందుకున్నారు.. గాజువాక ,భీమిలి, మంగళగిరి వంటి ప్రాంతాలలో 90 వేలకు పైగా మెజారిటీ సంపాదించుకుంది కూటమి.. కుప్పంలో 60 వేల మెజారిటీ వస్తే గొప్ప అనుకున్నాను.. తన 39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశాన్ని గెలిపించడమే కాకుండా తన కొడుకు లోకేష్ కి 92,000 మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాము అంటూ తెలిపారు.


లోకేష్ తన కుమారుడు అని కాకుండా అతిపెద్ద మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గంలో మూడో నియోజకవర్గమే మంగళగిరి అని చెప్పారు..ఈ ప్రాంతంలో తక్కువ మెజారిటీతో గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా అసలు పట్టించుకునే వాడిని కాదు మెరిట్ విషయం వచ్చేసరికి లోకేష్ తనకంటే మించిపోయారని తెలిపారు. అందుకే ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిది తెలుగుదేశం పార్టీది అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు. లోకేష్ ఇంకా తన పనితో సమర్ధుడు అని నిరూపించుకోవాలి అంటూ తెలిపారు ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి గాని మాట్లాడడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: