ప్రతి ఒక్కరి లైఫ్ లో విజయానికి ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర పేరు మనలో చాలామంది కచ్చితంగా వినే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా పోలీస్ సూపరిండెంట్ గా ఉమేశ్ చంద్ర పని చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ గా మావోయిస్ట్ లపై ఉక్కుపాదం మోపిన ఆయన 1999 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన నక్సలైట్ల కాల్పుల్లో మృతి చెందారు.
 
2000 సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో కూడలి దగ్గర ఉమేశ్ చంద్ర విగ్రహాన్ని నెలకొల్పారు. ఉమేశ్ చంద్ర భౌతికంగా మరణించినా ఎంతోమందికి ఆయన స్పూర్తిగా నిలిచారు. ఉమేశ్ చంద్ర భార్య చదలవాడ నాగరాణి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఉమేశ్ చంద్ర మరణించిన సమయంలో ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్నారు.
 
ఉమేశ్ చంద్ర సేవలకు గౌరవంగా చంద్రబాబు నాయుడు ఆయన భార్యకు డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఆమె అంచెలంచెలుగా ఎదిగి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ గా కూడా పని చేశారు. చదలవాడ నాగరాణి గారు బీబీఎం చదివారు. డిప్యూటీ కలెక్టర్ గా విధుల్లోకి వచ్చిన రోజు నుంచి వివాదాలకు తావివ్వకుండా బాధ్యతలను సక్రమంగా ఆమె నిర్వర్తించారు.
 
చదలవాడ నాగరాణి స్వస్థలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాగా ఆమె పొరుగు జిల్లా అయిన పశ్చిమ గోదావరికి కలెక్టర్ గా రావడం గోదావరి వాసులకు సంతోషాన్ని కలిగిస్తోంది. చదలవాడ నాగరాణికి ఒక కొడుకు ఉన్నాడు. కూటమి సర్కార్ నాగరాణిని కలెక్టర్ గా నియమించిన నేపథ్యంలో ఆమె విధులను సక్రమంగా నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: