క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు గ‌త ఐదేళ్ల‌లో తెలుగు మీడియాకు.. తెలుగు సోష‌ల్ మీడియాకు.. అటు నేష‌న‌ల్ మీడియాకు కావాల్సినంత స్ట‌ప్ ఇచ్చారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రి క్ష‌ణంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అక్క‌డ ఎంపీగా గెలిచారు. ఎంపీ అయిన ఆరు నెల‌ల నుంచే వైసీపీతో.. అటు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో విబేధించ‌డం మొద‌లు పెట్టారు. చివ‌ర‌కు చివ‌రి మూడేళ్లు వైసీపీలోనే ఉంటూ సొంత పార్టీ నేత‌లు.. గ‌త జ‌గ‌న్ పాల‌న విధానాలు విమ‌ర్శించ‌డం.. జ‌గ‌న్ చ‌ర్య‌ల‌ను తూర్పార ప‌ట్ట‌డం చేస్తూ హైలెట్ అయ్యారు.


చివ‌ర‌కు ఈ ఎన్నిక‌ల‌కు ముందు ర‌ఘురామ బీజేపీ లో చేర‌తార‌ని.. ఆయ‌న న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అనూహ్యంగా ర‌ఘురామ టీడీపీ లో చేర‌డంతో పాటు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ర‌ఘురామ‌కు ఖ‌చ్చితంగా స్పీక‌ర్ ప‌ద‌వి వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే అసెంబ్లీలో వైసీపీకి క‌నీస స్థాయిలో కూడా సీట్లు రాక‌పోవ‌డంతో ఆయ‌నే ఆ ప‌ద‌వి తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు.


ఇక ఇప్పుడు ర‌ఘురామ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేసేందుకు స‌రికొత్త ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న ప్రత్యేక ప్రయత్నంతో చాలా మంది ప్ర‌ముఖులు త‌మ వంతుగా స్పందిస్తున్నారు. ఆయన మిత్రుల‌తో పాటు గా సినీ ఇండస్ట్రీలోని వారు కూడా స్పందిచి ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోని డ్రైనేజ్ మెయింట్‌నెన్స్‌కు త‌మ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికే కాలువల పూడిక తీత పనులు ప్రారంభించ‌గా.. చాలా చోట్ల డ్రైనేజీ క్లియరెన్స్ చేస్తున్నారు.


ఈ ప‌ని నియోజ‌క‌వ‌ర్గంలో రైతుల‌కు చాలా బాగా హెల్ఫ్ కానుంది. ఇక ర‌ఘురామ ఇప్పుడు ఇత‌ర వ్యాప‌కాలు లేకుండా పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గం మీదే కాన్‌సంట్రేష‌న్ చేస్తూ వ‌స్తున్నారు.  వైసీపీ హయాంలో ఐదేళ్లు ఎంపీగా ఉన్నా కనీసం సొంత నియోజకవర్గంలో పర్యటించలేకపోయారు.. అలా అన‌డం కంటే వైసీపీ వాళ్లే ఆయ‌న్ను ఏం చేయ‌నీయ‌కుండా అడ్డుకున్నారు. ఇప్పుడు స‌రికొత్త‌గా అభివృద్ధి ప‌నులు చేస్తూ ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేల‌కే ఆద‌ర్శ‌నీయంగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: