ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైసిపి వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది.. వాలంటీలను అటు కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు విమర్శించినప్పటికీ చివరికి వారికి 5000 కాదు పదివేల జీతం ఇస్తామంటూ తెలిపారు.. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీలతో కాకుండా సచివాలయ ఉద్యోగులతో పింఛన్ ని సైతం పంపిణీ చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారు అన్నట్లుగానే ఈరోజు సచివాలయ ఉద్యోగులతోనే పించన్ని పంపిణీ  చేయడం జరిగింది.


గతంలో సుమారుగా 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో ఒకటో తేదీన ఉదయాన్నే వాలంటీర్లు సైతం పించన్ ప్రతి ఇంటికి తిరిగి ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటిసారి పించిని పంచారు. గీత ఈ విషయం పైన వాలంటరీలను టిడిపి ప్రభుత్వం పక్కన పెట్టింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పెన్షన్తో పాటు వాలంటరీ వ్యవస్థ పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.



ఇందులో భాగంగానే ఏప్రిల్ మే నెలలో వాలంటీర్లతో  పింఛన్ పంపిణీ చేయాలని గతంలో తెలియజేశామని.. అయితే వారు పంపిణీ చేయించేలా చేయలేదని తెలిపారు.. అందుకే ఏప్రిల్ మే నెలలో 33 మంది మరణించారు అంటు చంద్రబాబు విమర్శించారు. అలాంటి సమయంలోనే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ పంచమని కూడా తెలియజేశామని కానీ ఎవరు చేయలేదు..ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బందితో అది ఎందుకు చేయకూడదని పట్టుదలతో వారితోనే ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్ సైతం అందించామంటూ తెలిపారు మొదటి రోజు 100% వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే కొన్నిచోట్ల ఆశ వర్కర్లను అంగన్వాడి వర్కర్లను కూడా వినియోగించుకోవాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: