జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం గా జోరు కొనసాగిస్తున్నాడు. రాత్రింబవళ్లు తనకు కేటాయించిన మంత్రి వర్గ శాఖల సమీక్ష, అకౌంట్ల తనిఖీలు చేస్తూ లెక్కలు బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ హమీలో భాగంగా పిఠాపురం లో పేదలకు పెన్షన్ల అందజేసే కార్యక్రమం లో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతం లో నేను ఎమ్మెల్యే గా జీతం తీసుకొని పనిచేస్తానని చెప్పాను. ఎందుకంటే జీతం తీసుకొంటే నేను చేసే పనికి, ప్రజలకు జవాబుదారీగా ఉంటాను. అందుకే నేను జీతం తీసుకొనే పనిచేస్తాను అని పవన్ కల్యాణ్ గతంలో చెప్పాడు. తాజాగా పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో దానికి విభిన్నం గా మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్యాంప్ ఆఫీస్ కేటాయించారు. వాటికి మరమ్మత్తులు ఏం చేయాలని అడిగితే.. అలాంటివేమీ వద్దు.. నేనే సొంతంగా ఫర్నీచర్ తెచ్చుకొంటానని చెప్పాను. అలాగే మొన్న అసెంబ్లీ సిబ్బంది వచ్చి.. మీరు సమావేశాలకు హాజరయ్యారు. దానికి మీకు జీతభత్యాలు ఉంటాయి. మీరు సంతకం పెడితే ఇస్తామని అన్నారు. అందుకు నిరాకరించి.. నేను 35 వేల జీతం తీసుకోనని చెప్పాను అని పవన్ కల్యాణ్ అన్నారు.పంచాయితీ మంత్రిత్వశాఖ వ్యవహారాలను సమీక్షించినప్పుడు.. దానిలో నిధులు లేవు. ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియడం లేదు. ప్రతీ విభాగాన్ని రివ్యూ చేస్తే.. ఎంత అప్పు ఉందో తెలియడం లేదు. అప్పుడు నాకు ఇలాంటివి కరెక్ట్ చేయాలనిపించింది అని పవన్ కల్యాణ్ అన్నారు.ఒక్కో పనికీ అయిన ఖర్చు.. చేయాల్సిన ఖర్చులు.. ముందున్న లక్ష్యాలకు శాఖలో డబ్బే లేదు. ఇంక నేనేం జీతం తీసుకుంటా. ముందు వాటిని కరెక్ట్ చేయాలి. అందుకే జీతం వద్దని చెప్పా. నా దేశం, నేల కోసం పని చేస్తా.. అవసరాలు నేను సమకూర్చుకుంటానని చెప్పా'నని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: