ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా పంపిణీ చేయవచ్చో నిరూపిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల ఫలితాల తర్వాత తొలి బహిరంగ సభను గొల్లప్రోలులోనే ఏర్పాటు చేసిన పవన్.. స్థానికులతో మనసు విప్పి మాట్లాడారు. ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఊరేగింపులు చేయాలనుకోలేదని, ఇప్పుడు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం తాను పాలనా విధానాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేయదల్చుకోలేదన్నారు.కూటమి వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని చాలా మంది చెప్పారని, కానీ తాము వచ్చాక పెన్షన్లు పెంచి ఇస్తున్నట్లు పవన్ గుర్తుచేశారు. అలాగే వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారని, దాన్ని తప్పని నిరూపించడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తున్నట్లు పవన్ తెలిపారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని, కానీ ఎక్కడ ఆగాయని పవన్ ప్రశ్నించారు. ఇవాళ ఇంటికి పెన్షన్లు వచ్చాయా లేదా అని అడిగారు.

పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ సభ జరిగింది. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేశామని, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగలేదని అన్నారు. ''నాడు వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ఊదరగొట్టారే.? నేడు వలంటీర్లు లేరు.. పెన్షన్లు ఆగాయా..? రెట్టింపు పెన్షన్‌ను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి మరీ ఇస్తున్నారు కదా.. గతంలో పెన్షన్ల పంపిణీకి 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం లోగా 100 శాతం పెన్షన్లు ఇస్తాం'' అని పవన్‌ పేర్కొన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అనేదానిపై ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులకు కచ్చితంగా బాధ్యత, జవాబుదారీ తనం ఉంటుందని.. సచివాలయ ఉద్యోగి ఎవరైనా ఇకపై డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు.వాలంటీర్లను ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి.. అనే అంశంపై ఆలోచన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను గమనిస్తే.. ఒక్కో సచివాలయానికి పది మంది వరకు ఉద్యోగులు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వీరందరి సేవలు వినియోగించుకుంటే.. ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయొచ్చన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: