ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతోంది. దాదాపుగా ఇప్పటివరకు 50 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది ఇంటికి వెళ్లి మరి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోంది సచివాలయ ఉద్యోగులు. ఈరోజు ఒక్క రోజులోనే 100% పెన్షన్ ని సైతం పూర్తి చేసే విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మందికి పించిని అందించాలని బాధ్యతలను కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అప్పగించారు. మొదటిరోజు అందుకోలేని వారికి రెండో రోజు ఇళ్ల వద్దకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందించాలని తెలిపారు.


పెన్షన్ పంపిణీల మంత్రులు ఎమ్మెల్యేలు సైతం భాగస్వామ్యులు అయ్యారు అయితే ఏపీలో అర్హత ఉండి పెన్షన్ పొందాలనుకునే వారు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మొదట గవర్మెంట్ అఫీషియల్ వెబ్సైటు అయిన..https://sspensions.ap.gov.in/ssp/home/index సైట్ లోకి వెళ్ళాలి.. పోర్టల్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజన అనే దరఖాస్తుల సైతం చేసుకోవడానికి ఆ ఫామ్ ని డౌన్లోడ్ చేయాలి.. అయితే ఈ ఫారం నింపి ఎక్కడ తప్పులు లేకుండా చూసుకొని ఆ ఫారంకు ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు ,ఆదాయకుల ధ్రువ పత్రం వంటివి జత చేయాలి.


ఆ తర్వాత మీ దగ్గరలో ఉండే గ్రామ సచివాలయాలలోకి వెళ్లి ఆ అప్లికేషన్ ని అందించాల్సి ఉంటుంది. ఏదైనా సమాచారం పెన్షన్ కి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అంటే టోల్ ఫ్రీ నెంబర్ అయినా..0866-2410017 కాల్ చేసి సమాచారాన్ని పొందుకోవచ్చు. ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరి రాబోయే రోజుల్లో మరింతమంది టెన్షన్ తీసుకుని అవకాశముంది.. ముఖ్యంగా 50 ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కూడా చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: