*ఘోరంగా ఓడినా మారని జగన్ తీరు
*మళ్ళీ వారికే పార్టీలో ప్రాధాన్యతను ఇస్తున్న జగన్
*ఇప్పటికీ మారకుంటే ఈ సారి కూడా కష్టమే అంటున్న రాజకీయ విశ్లేషకులు

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈ సారి కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొంది అన్నింటిని గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాడు అంతే కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించారు. అయితే గత ఎన్నికలలో  151 సీట్లు సాధించిన వైసీపీ పార్టీ ఈ సారి  కేవలం 11 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.  గత వైసీపీ కాబినెట్ లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తప్ప మిగిలిన మంత్రులందరు దారుణంగా ఓడిపోయారు.రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వైసీపీ హయాంలో మంత్రులను జగన్ కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టేందుకే పెట్టుకున్నట్లు వారు వ్యవహారించారు. వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని అంతగా గుర్తింపు లభించలేదు.


జగన్ నియమించిన వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండటంతో సంబంధిత నాయకులకు తమ నియోజకవర్గంలో ప్రాధన్యత లేకుండా పోయింది. ఏ పధకం కావాలి అన్నా కూడా వాలంటీర్ పై ఆధారపడాల్సి వచ్చింది. వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమా అంటే అది కాదు తమ ప్రభుత్వ పనులు సరిగ్గా జరిగేందుకు జగన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ.. దీనితో కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడంతో వారు నిరాశకు గురయ్యారు.జగన్ సీఎం అయినా కూడా ప్రభుత్వం అంతా సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి సలహాదారులు ప్రభుత్వాన్ని నడిపారనే విమర్శలు వున్నాయి. 

జగన్ ప్రభుత్వంలో మంత్రులతో పాటు సలహాదారులదే కీలక పాత్ర. సామాన్య ఎమ్మెల్యే కు అపాయింట్ మెంట్ కూడా దొరకని పరిస్థితి.. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం జగన్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసారు.జగన్ మెప్పు పొందటం కోసం అయన చుట్టూ చేరి భజన చేసే వారికే జగన్ ప్రాధన్యతను ఇచ్చారు. దీనితో ఈ ఎన్నికలలో జగన్ ఘోరంగా ఓడిపోయారు. అంత ఘోరంగా ఓడిపోయినా కూడా జగన్ తీరుమారలేదని తెలుస్తుంది. ఇప్పటికి సజ్జల, విజయ్ సాయి రెడ్డి, అవినాష్ వంటి వారికే జగన్ ప్రాధాన్యతని ఇస్తున్నారు. ఇప్పటికైనా జగన్ పార్టీ క్యాడర్ పై దృష్టి పెట్టకపోతే ఈ సారి కూడా గెలుపు కష్టమే అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: