ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెన్షన్ పండగ మొదలయ్యింది.. ముఖ్యంగా ఉచితంగా డబ్బులు వస్తున్నాయంటే చాలు ఎవరికైనా ఆశ ఉండనే ఉంటుంది. ఈ రోజున పెన్షన్ దారులకు ₹7,000 ఏపీ ప్రభుత్వం అందించింది. దీంతో ఏపీ ప్రజలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఎప్పుడు లేనంత విధంగా సామాజిక పెన్షన్లు జులై నెలలోనే ఇచ్చారు.అయితే ఇందులో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మధ్య మూడు నెలలుగా పెంచిన ఒక్కో  వెయ్యి రూపాయలను సైతం ఈ నెల కలిపి ఇచ్చారు. దీంతో పింఛన్దారులకు మంచి బంపర్ ఆఫర్ తగిలినట్లుగా అనిపించింది.


కేవలం ఒక్క నెల తేడాతోనే 4వేల రూపాయలు అలా కలిసి వచ్చాయని చెప్పవచ్చు. దీంతో సామాజిక పెన్షన్ లబ్ధిదారులు 7వేల రూపాయలను చూసి ఒక్కసారిగా మురిసిపోతున్నారు ఇంత పెద్ద మొత్తాన్ని ప్రతినెలా ఇస్తే బాగుంటుందని విధంగా మాట్లాడుకుంటున్నారట. పెన్షన్ ని ఇంత మొత్తంలో ఎప్పుడూ కూడా ఒకేసారి అందుకోవడం లేదని దీంతో డబ్బు ఎవరికైనా చేదు కాదు కదా అంటూ తెలియజేస్తున్నారు. అయితే నాలుగు వేల రూపాయలకే ఎందుకు పరిమితం కావాలి అనే చర్చ ఎప్పుడూ ఏపీ ప్రజలలో మొదలయ్యింది.


ఇప్పుడు ఇచ్చిన ఏడువేల రూపాయలు అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనే చర్చ కూడా ఇప్పుడు ఏపీ ప్రజలలో మొదలయ్యిందట  అంటే ఒకేసారి 3000 నుంచి ₹7,000 రావడంతో పెన్షన్ దారుల మూడు ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఇది మిగిలిన మూడు నెలల బకాయి అనే విషయాన్ని మర్చిపోయారు.ఏది ఏమైనా 7 వేల రూపాయలు ఒక నెలకు ఇచ్చి మరుసటి నెలకు 4000 రూపాయలకే పడిపోతే ఎలా అంటూ ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఇదే 7000 రూపాయలు పెన్షన్ రావాలి అంటే సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుందని చెప్పవచ్చు. 2014లో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2024 కి 4 వేల రూపాయల వరకు పెరిగింది దీన్ని బట్టి చూస్తే 7000 కావాలి అంటే ఆ సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: